RGV పరువు తీసేసిన యాంకర్ శ్యామల.. ఏంది తల్లో ఈ మెసేజ్లు..?

రామ్ గోపాల్ వర్మ.. భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ ఈయనది. ఉన్నది ఉన్నట్లు..మొహానే చెప్పేస్తాడు. అవతల ఉన్న వ్యక్తి..ఎవ్వడైన కానీ ..డోంట్ కేర్..నాకు అనిపించింది నేను చెప్పుతా అంటాడు. నువ్వు వినకపోతే నీ కర్మ అంటూ వదిలేయడు..వినేలా చేస్తాడు . ఈయన నోటీకి అడ్డు అదుపు ఉండదు. పోనీ చెడ్డ వాడా అంటే అలా కాదు..ఈ మధ్య జరిగిన ఏపీ టికెట్ల ఇష్యూలో అసలు నిజాలు మాట్లాడి ఇండస్ట్రీ తరపున డేరింగా నిలబడిన మనిషి.

పోనీ మంచివాడా అంటే ..ఆయన వీడియోలు..మాటలు..చేష్టలు చూస్తుంటే ఆ టైప్ కానే కాదు అనిపిస్తుంది. అంతేందుకు నేను మంచివాడిని కాదు అని ఆయనే చెప్పుతున్నారుగా. ఇక ఈయన మంచి వ్యక్తో ..చెడ్డ వ్యక్తో ఆ దేవుడికే తెలియాలి. ఎప్పటికప్పుడు హాట్ ట్రెండింగ్ టాపిక్ పై అడిగినా .. అడగకపోయినా సలహాలు ఇస్తూ..నెట్టింట ఎవర్ గ్రీన్ ట్రేండింగ్ లో ఉంటాడు. ఈ మధ్య మొన్న ఓ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కి వెళ్లి ..అక్కడున్న హోస్ట్ చేస్తున్న యాంకర్ శ్యామలతో మాట్లాడిన తీరు..చేసిన కామెంట్స్ అందరిని షాక్ కు గురి చేశాయి.

ఆయన మాట్లాడుతూ..”ఇంత అందంగా ఉన్న నువ్వు..ఇన్నాళ్లు నా కళ్ల నుంచి ఎలా తప్పించుకున్నావ్” అంటూ కామెంట్స్ చేశాడు. దీంతో మైండ్ బ్లాక్ అయిన శ్యామల అక్కడ ఏం మాట్లాడలేదు. కానీ రీసెంట్ గా అభిమానులతో చిట్ చాట్ చేస్తూ.. సరదగా ఎవైన ప్రశ్నలు అడగండి ఆన్సర్ ఇస్తా అంటూ చెప్పుకొచ్చింది. ఇక నెటిజన్స్ తన పర్సనల్ ధింగ్స్ గురించి అడుగుతూ.. ఓ నెటిజన్ రామ్ గోపాల వర్మ గురించి అడిగేశాడు. వర్మ గురించి ఏదైనా చెప్పండి అని అడగడంతో.. అంతే టక్కున శ్యామల నో కామెంట్ అని చెప్పేసింది. ఆయన గురించి నాకు ఎందుకు అని అనుకుందో.. లేక.. ఏం మాట్లాడితే మరే తలనొప్పులు వస్తాయో అనుకున్నిందో తెలియదు కానీ.. ఆయన గురించి ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కానీ ఆయన ఓ గొప్ప దర్శకుడు.. ఒకప్పుడు వర్మ చిత్రాలకు నేను పెద్ద అభిమానిని అంటూ చెప్పుకొచ్చింది శ్యామల. దీంతో నెటిజన్స్ ఒకప్పుడు అంటే.. ఇప్పుడు ఆయన సినిమాలు నచ్చడం లేదా..? అంత చీప్ అయిపోయాడా..? అసలు సినిమాలు తీయ్యడానికి పనికిరాడా..? అంటూ పరోక్షంగా వర్మనే ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తానికి శ్యామల మాత్రం వర్మ మీద పరోక్షంగా సెటైర్లు వేసినట్టు అనిపిస్తోంది.