వెరీ ఇంట్రస్టింగ్ న్యూస్.. ఓ హీరో, హీరోయిన్ రియల్ దంపతులు అవుతున్నారు. ఆ హీరో తెలుగు వాడే… మన టాలీవుడ్ హీరోయే.. అమ్మాయి తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న కోలీవుడ్ హీరోయిన్. ఎక్కడ చిగురించిందో కాని మూడేళ్ల నుంచే వీరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారు.. ఎట్టకేలకు ఇప్పుడు పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. కన్నడ అమ్మాయి సంజన గల్రానీ.. మనకు బాగా తెలిసిన పేరు సంజన. గత యేడాది డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుని జైలుకు కూడా వెళ్లి వచ్చింది. తెలుగులో ప్రభాస్ బుజ్జిగాడు సినిమాతో పాటు ఒకటీ అరా సినిమాలు చేసింది. టాలెంట్ ఉన్న అమ్మాయే.. అయితే ఎందుకో కాని హీరోయిన్‌గా పెద్దగా క్లిక్ కాలేదు.
సంజన తర్వాత ఆమె చెల్లి నిక్కీ గల్రానీ కూడా అక్క బాటలోనే హీరోయిన్ అయ్యింది. సేమ్ టు సేమ్ చూడడానికి కావాల్సినంత అందం.. అభినయం ఉన్నా కూడా పెద్ద సినిమాల్లో ఛాన్సులు రాలేదు. నిక్కీ తెలుగులో మాత్రమే కాదు సౌత్‌లో అన్ని భాషల్లోనూ నటించింది. తమిళంలో ఆమె యాగవరాయునం నా కాక్క సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఆది పినిశెట్టి హీరో. తెలుగులోనూ ఈ సినిమా మలుపు పేరుతో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా టైంలోనే ఆది, నిక్కీ మధ్య పరిచయం ప్రేమగా మారింది.
సీక్రెట్‌గా కొద్ది రోజుల పాటు డేటింగ్ కూడా చేస్తున్నారు. ఇక ఆదిపినిశెట్టి ఇంట్లో జరిగే ఫంక్షన్లకు కూడా నిక్కీ హాజరవుతూ ఉంటుంది. ఇక కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో కూడా వీరిద్దరు కలిసే దర్శనం ఇచ్చారు. దీంతో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలకు ఇవి మరింత బలం చేకూర్చినట్లు అయ్యింది. ఇక త్వరలోనే పెళ్లికి రెడీ అవుతోన్న వీరి ఎంగేజ్‌మెంట్ పనులు ప్రారంభమైనట్టు కూడా తెలిసింది.
ఎంగేజ్‌మెంట్ తర్వాత పెళ్లి డేట్ కూడా త్వరలోనే ఫిక్స్ అవుతుందని అంటున్నారు. అయితే ఈ వార్తలపై నిక్కీ, ఆది పినిశెట్టి స్పందించలేదు. ఆది పినిశెట్టి ఎవరో కాదు ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడు. ఆది ముందు తెలుగు కంటే తమిళంపైనే ఎక్కువుగా ఫోకస్ చేశాడు. తెలుగులో సరైనోడు, అజ్ఞాతవాసి, నిన్ను కోరి సినిమాల్లో నటించాడు.