ఆ వైసీపీ మంత్రికి ఇంత నెగిటివిటీనా… అన్నీ సెల్ఫ్ గోల్సే..!

మరి పదవులు వస్తే అదేదో హోదా లాగా ఫీల్ అయిపోయి…పెత్తనం చేసే నేతలు ఎక్కువైపోయారు. పదవుల ద్వారా ప్రజలకు సేవ చేసే విషయం పక్కనబెడితే..ప్రజల మీద పెత్తనం చేయడం ఎక్కువైంది. ఇంకా మంత్రి పదవి లాంటిది ఉంటే…ఇంకా తామేదో ఒక రాజ్యానికి రాజు అన్నట్లు నేతలు ఊహించుకుని హడావిడి చేసేస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో కొంద‌రు మంత్రులు అలాగే ఫీల్ అవుతున్నారని విశ్లేషకులే కాదు ప‌బ్లిక్‌లోనూ అదే ఫీలింగ్ ఉంది.

అసలు ఏపీ మంత్రుల్లో కొంద‌రు ఈ రెండున్నర ఏళ్లలో ఏం పనులు చేశారో తెలియదు గాని…అనేక వివాదాల్లో మాత్రం ఉంటున్నారు. అసలు మంత్రి అంటే ఎంత పద్ధతిగా ఉండాలి..కానీ మన ఏపీ మంత్రులు అలా ఉండటం కష్టమే…పైగా తమకు ఎవరైనా అడ్డు చెబితే వారిని బూతులు తిట్టడం, రాజకీయంగా ఇబ్బందులు పెట్టడం చేస్తున్నారు. ఇలా చేస్తే పబ్లిక్‌లో ఇమేజ్ పెరుగుతుందని అనుకుంటున్నట్లు ఉన్నారు…కానీ అలా చేస్తే ఇంకా ఇమేజ్ తగ్గుతుందని తెలియడం లేదు.

రాజకీయాల్లో అప్పలరాజు చాలా జూనియర్…ఫస్ట్ టైమ్ పోటీ చేసి…ఏదో జగన్ గాలిలో ఎమ్మెల్యే అయ్యారు.. అలాగే అదృష్టం కొద్ది మంత్రి పదవి దక్కింది. మరి తక్కువ సమయంలోనే ఇంత పెద్ద బాధ్యత వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా పనిచేయాలి… ప్రజలు మన్ననలు పొందేలా ఉండాలి. కానీ అప్పలరాజు అలా ఉంటున్నారా? అంటే అది జనాలని అడిగితే బెటర్ అని చెప్పొచ్చు. అప్పలరాజు పనితీరుపై ఏ స్థాయిలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారో…అసలు సొంత పలాస నియోజకవర్గ ప్రజలు ఎంత అసంతృప్తిగా ఉన్నారో చెప్పాల్సిన పని లేదు.

ఇటీవ‌ల కాలంలో ఆయ‌న ఎక్కువుగా అస‌భ్య‌క‌ర ప‌ద‌జాలం వాడుతూ బాగా హైలైట్ అవ్వాలని అనుకున్నారు…తాజాగా పోలీసులపైనే బూతుల వర్షం కురిపించారు. అసలు మంత్రిగా ఉంటే ఏదైనా మాట్లాడొచ్చు అనుకుంటున్నారో ఏంటో తెలియడం లేదని జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇలా ఎక్కడకక్కడ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ..అప్పలరాజు నెగిటివ్ పెంచుకుంటున్నారు తప్ప…ఆయనకేమి ప్లస్ అవ్వడం లేదు. మొత్తానికి అప్పలరాజు చేతులారా ప్రజల్లో చులకన అవుతున్నారు.


Leave a Reply

*