చిరంజీవి గారి మీటింగ్ తో మాకు సంబంధం లేదు మీడియాకి షాక్ ఇచ్చిన విష్ణు..

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కొరోనా దెబ్బకి కోలుకోలేని దెబ్బ తిన్నది .ఆ దెబ్బ మీద టిక్కెట్ల రేట్లు రూపంలో వైఎస్ జగన్ సర్కార్ దెబ్బకి కక్కలేక మింగలేక అన్నట్టు ఉన్నది తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి.నిన్నగాక మొన్న జగన్ తో చిరంజీవి భేటీ అయిన సంగతి అందరకి తెలిసిందే . ఆ భేటీ పై ‘మా ‘ అధ్యక్షుడు మంచి విష్ణు తాజాగా స్పందించారు .అయన ఏమన్నారో అయన మాటలోనే చూద్దాం .

‘మా’ అధ్యక్షుడిగా నేను వ్యక్తిగతంగా ఏమీ మాట్లాడకూడదు. ఇటీవల చిరంజీవిగారు జగన్‌ని కలిశారు. అది వ్యక్తిగత సమావేశం. దానిని అసోసియేషన్‌ మీటింగ్‌గా భావించకూడదు. రెండు ప్రభుత్వాలు ఇండస్ట్రీని ప్రోత్సహిస్తున్నాయి. ప్రభుత్వాలతో ఛాంబర్‌ చర్చలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇస్తోంది. అలా కాకుండా వ్యక్తిగతంగా కలవాలని కోరితే మేం కూడా ఆయా ప్రభుత్వాలను కలిసి చర్చిస్తాం. లెజెండరీ నటులు చిరంజీవి, బాలకృష్ణ, మోహన్‌బాబు, నాగార్జున, వెంకటేష్‌గారు మా తరానికి ఆదర్శం. వీరంత కలిసి పరిశ్రమ బాగు కోసం సరైన నిర్ణయం తీసుకుంటారు.

Share post:

Latest