చెత్త రీజన్ తో ఆ హీరో సినిమాను రిజెక్ట్ చేసిన కృతి..ఇంత హెడ్ వెయిట్ ఏంటి బేబమ్మా..?

ఒక్క సినిమాతో తన తల రాతను మార్చుకున్న అదృష్టవంతురాలు ఈ బేబమ్మ..అదేనండి కృతి శెట్టి. ఈ మధ్య కాలంలో అందరి హీరోలకు..డైరెక్టర్లకు..ప్రొడ్యూసర్ల కన్ను ఈమె పైనే పడింది. అంతేలేండి.. ముందొచ్చిన కొమ్ములకంటే వెనుకొచ్చిన చెవులు వాడి అని మన పెద్ద వాళ్ళు ఊరికే చెప్పుతారా.. ఎన్నో చూసి మరెన్నో అనుభవించే ఇలాంటివి చెప్పుతారు. నిన్నకాక మొన్న వచ్చిన ఈ అమ్మడు అంటే ఎందుకు అందరు డైరెక్టర్లు అంతలా ఎగబడుతున్నారో తెలియడం లేదు.

పోనీ, అమ్మడు ఓ అని చెప్పుకునే ఫిగర్ కాదు.. ఏదో తెల్లటి చర్మం చూడగానే అట్రాక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. హీరోయిన్ గా ఎదగడానికి పెద్దగా చెప్పుకొతగ్గిన క్వాలిటీస్ కూడా లేవు. ఏదో అమ్మడు అదృష్టం బాగుండి..ఫస్ట్ సినిమానే మెగా హీరోతో చేసే ఛాన్స్ రావడంతో అలా హిట్ కొట్టింది. ఇక రెండో సినిమా శ్యాం సింగరాయ్ విషయానికి వస్తే..అమ్మడు పాత్ర అస్సలు ఏం లేదు..మొత్తం సాయి పల్లవి దే..ఉంది అక్కడ.

నాని తో బెడ్ సీన్స్ మినహాయిస్తే..కృతి పాత్ర చాలా తక్కువ..నాని పర్ఫామెన్స్ బాగుండి సినిమా హిట్ అయితే అది తీసుకెళ్ళి కృతి ఖాతాలో వేసారు. ఇక మూడో సినిమా బంగార్రాజు లో మాత్రం కొంచెం కంటికి చక్కగా కనిపించి అలరించింది. డైరెక్టర్ కృతిని తెర పై బాగా చూయించారు. ఈ సినిమా విజయంలో అంతో ఇంతో కృతికి కూడా భాగం వెళ్తుంది అంతే తప్పిస్తే..అమ్మడు టాలీవుడ్ ని ఏలేసే హీరోయిన్ మాత్రం కాదు అని నెటిజన్స్ నుండి వినిపిస్తున్న మాట.

ఇక ప్రస్తుతం ఆరు సినిమాలు చేతిలో పట్టుకుని మరో రెండేళ్ళు గ్యాప్ లేకుండా కాల్ షీట్లు ఫిల్ చేసుకున్న ఈ బ్యూటికి టాలీవుడ్ యంగ్ హీరో సినిమాలో హీరోయిన్ గా చాన్స్ వస్తే చేయడానికి రిజెక్ట్ చేసిందట. అస్సలు మ్యాచ్ కానీ రీజన్స్ చెప్తూ..డైరెక్టర్ కు సింపుల్ గా నో చెప్పేసిందట. అంతేకాదు ఆ డైరెక్టర్ కు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా..పో అని చెప్పకుండానే పంపించేసిందట. దీంతో కొందరు అభిమానులు కృతి బీహేవియర్ పట్ల హర్ట్ అవుతున్నారు అని టాక్. ఇంత తల పొగరు ఉంటే కష్టం బేబమ్మా అంటూ మండిపడుతున్నట్లు తెలుస్తుంది. ఇక బేబమ్మా వాళ్లను ఎలా కూల్ చేస్తుందో చూడాలి..!