కేటీఆర్ ఇలాకాలో బాల‌య్య‌…!

బాల‌య్య తాజా బ్లాక్‌బ‌స్ట‌ర్ అఖండ చిత్రంతో లయన్ రోర్ ఎంత ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంటుందో చూశాం. క‌రోనా క్రైసిస్‌లో కూడా అదిరిపోయే రేంజ్లో వ‌సూళ్లు రాబ‌ట్టింది. బోయ‌పాటి – బాల‌య్య కాంబినేష‌న్లో వ‌చ్చిన అఖండ హ్యాట్రిక్ హిట్ కొట్ట‌డంతో పాటు థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోయేలా చేసింది. ఇప్పుడు బాల‌య్య క్రాక్ ద‌ర్శ‌కుడితో కిరాక్ పుట్టించేందుకు రెడీ అవుతున్నాడు. గ‌తేడాది మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ‌తో క్రాక్ లాంటి మాస్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చిన మ‌లినేని గోపీచంద్ ఇప్పుడు బాల‌య్య 107వ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

బాల‌య్య 107వ సినిమాగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో బాల‌య్య‌కు జోడీగా శృతీహాస‌న్ న‌టిస్తోంది. కోలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభ‌మ‌వుతోంది. ఈ యేడాది దసరాకి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేయనున్నారు. బాల‌య్య స‌రికొత్త పాత్ర‌లో క‌నిపించ‌బోతోన్న ఈ సినిమా కంప్లీట్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్క‌నుంది.

మైత్రీ మూవీస్ నిర్మించే ఈ సినిమాలో బాలయ్య రెండు డిఫ‌రెంట్ గెట‌ప్స్‌లో క‌నిపిస్తాడు. ఈ సినిమా షూటింగ్ ముందుగా మంత్రి కేటీఆర్ ఇలాకా అయిన సిరిసిల్ల‌లో ప్రారంభించ‌బోతున్నార‌ట‌. క్రాక్‌తో ర‌వితేజ‌కు సూప‌ర్ హిట్ ఇవ్వ‌డంతో పాటు తాను కూడా ఫామ్‌లోకి వ‌చ్చాడు మ‌లినేని గోపీచంద్‌. ఇప్పుడు అఖండ త‌ర్వాత బాల‌య్య ఇమేజ్‌ను మ్యానేజ్ చేస్తూ ఈ సినిమా తెర‌కెక్కించ‌డం అంటే గోపీచంద్‌కు క‌త్తిమీద సాములాంటిదే.

Share post:

Latest