ఐకాన్ స్టార్ ‘పుష్ప ది రూల్ ‘పై న్యూ అప్ డేట్ !

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “పుష్ప ది రైజ్” .పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో కలెక్షన్స్ సాధించింది .పుష్ప సినిమా రెండు భాగాలుగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి ముందు నుంచి అందరికీ తెలిసిందే. పుష్ప ఫస్ట్ పార్ట్ కి వచ్చిన కేజ్రీకి రెండో భాగం “పుష్ప ది రూల్” పై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది .

ఇప్పుడు ‘పుష్ప ది రూల్ ‘ పార్ట్ పై ఇప్పుడు కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది .ఫస్ట్ పార్ట్ మ్యూజిక్ సెన్సేషన్ క్రియేటివ్ చేయడంతో పార్ట్ 2 కి అంతకి మించి సెన్సషనల్ క్రియేటివ్ లో చిత్ర యూనిట్ బిజీగా ఉన్నారట. అంతే కాకుండా దేవిశ్రీ ప్రసాద్ ఈసారి మరింత ఇంట్రెస్టింగ్ ట్యూన్స్ అందిస్తున్నాడని తెలుస్తుంది. అలాగే మేకర్స్ వచ్చే ఏప్రిల్ నెల నుంచి ఈ సినిమా షూట్ ను స్టార్ట్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్. ఇందులో రస్మిక మందన హీరోయిన్గా ,సునీల్ ,అనసూయ ప్రధాన పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే .