విడాకుల తర్వాత.. ధనుష్ భార్య ఐశ్వర్య ఏం చేస్తుందో తెలుసా?

ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎక్కడ చూసినా కూడా ఐశ్వర్య ధనుష్ విడాకుల గురించి చర్చించుకుంటున్నారు. ఎందుకంటే దాదాపు 18 సంవత్సరాల పాటు దాంపత్య బంధంలో ఎంతో అన్యోన్యంగా నే ఉన్నారు ఐశ్వర్య ధనుష్. ఇక ఒకరిపట్ల ఒకరు ఎంతో అమితమైన ప్రేమను చూపిస్తున్నారు. ఇటీవల ఎవరూ ఊహించని విధంగా ధనుష్ ఐశ్వర్య లు తమ 18 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారూ. ఐశ్వర్య ధనుష్ ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ.. ఇంత ప్రేమ ఉన్న ఐశ్వర్య ధనుష్ విడిపోవడానికి కారణం ఏంటి అన్న చర్చ మాత్రం ప్రస్తుతం ఊపందుకుంది అని చెప్పాలి.

 

అయితే ఇక ఐశ్వర్య రాజేష్ విడాకులు తీసుకుంటున్నాము అని ప్రకటించిన తర్వాత వాళ్లు త్వరలో మళ్ళీ కలుస్తారూ అంటూ ధనుష్ తండ్రి కామెంట్స్ చేయడం సంచలనం గా మారిపోయింది. దీంతో ధనుష్ ఐశ్వర్య మళ్ళీ కలుస్తారా లేకపోతే అఫీషియల్గా విడాకులు తీసుకుని అభిమానులను నిరాశపరుస్థారా అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.ఈ క్రమంలోనే ఇక విడాకుల ప్రకటన తర్వాత ధనుష్ ఐశ్వర్య ఏం చేస్తున్నారు అన్నదిప్రస్తుతం అభిమానులు వెతకడం ప్రారంభించారు. అయితే విడాకుల ప్రకటన తర్వాత అటు ఐశ్వర్య దర్శకురాలిగా ఫుల్ బిజీ అయిపోయింది అని తెలుస్తోంది.

ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల కోసం ఒక లవ్ సాంగ్ ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట ఐశ్వర్య. ఈ క్రమంలోనే ఈ సాంగునూ దగ్గరుండి దర్శకత్వం వహిస్తున్నారట. అంతేకాకుండా నిర్మాత ప్రేనా ఆరోరా కు పలు సలహాలు కూడా ఇస్తూ ఉన్నారట ఐశ్వర్య. అంతేకాదు ఇక ఐశ్వర్య తెరకెక్కిస్తున్న ఈ లవ్ సాంగ్ కు సంబంధించిన షూటింగ్ 25 నుంచి 27 వరకు హైదరాబాద్లోనే జరగబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Share post:

Popular