తెలుగు కమెడియన్స్ లో భార్యలను చూసారా? వారికి ఎంత మంది సంతానమో తెలుసా?

సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటుంటారు పెద్దలు. అచ్చం ఇలాగే సినిమాల్లో నవరసాలు ఉన్నప్పటికీ హాస్యరసం మాత్రం ఎంతో ప్రధానమైనది. కొన్ని కొన్ని సార్లు ఈ హాస్యరసమే సినిమాలకు సూపర్ హిట్ అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు ఎంతో మంది టాలీవుడ్ కమెడియన్స్ తమదైన శైలిలో కామెడీ చేసి తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన వారు ఉన్నారు. అయితే సినిమాల్లో అన్ని రసాలు ఎలా ఉన్నప్పటికీ హాస్యరసం మిస్ అయ్యింది అంటే చాలు ప్రేక్షకులు కాస్త హర్ట్ ఉంటారు. అందుకే ప్రతి సినిమాలో కమెడియన్స్ కీలక గా మారిపోతూ ఉంటాయి. కొంతమంది కమెడియన్స్ తన కామెడీతో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళడంలో కీలకపాత్ర వహిస్తూ ఉంటారు.

అయితే దాదాపు తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేక్షకులను నవ్వించినా కమెడియన్స్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కానీ వారి ఈ కుటుంబాలకు సంబంధించి వివరాలు మాత్రం చాలా మందికి తెలియదు. ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకప్పుడు కమెడియన్ గా తనదైన మార్క్ క్రియేట్ చేసిన సునీల్ తర్వాత హీరోగా ఇక ఇప్పుడు విధంగా విలన్ గా కూడా రాణిస్తున్నారు. దాదాపు 170 సినిమాల్లో కమెడియన్గా ప్రేక్షకులను నవ్వించాడు సునీల్.. 2002లో స్వాతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వీరికి ఒక కూతురు కూడా ఉంది.

ఇక లెజెండరీ కమెడియన్ గా గుర్తింపు సంపాదించిన బ్రహ్మానందం వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను కడుపు నవ్వించడమే కాదు గిన్నిస్ రికార్డ్ కూడా క్రియేట్ చేశారు. బ్రహ్మానందం భార్య పేరు లక్ష్మి.. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అందులో ఒకరు టాలీవుడ్ లో హీరోగా కూడా పరిచయం అయ్యారు.

ఎంద చాట అంటూ సరికొత్త పదాలతో కామెడీ పండించిన అలీ ఇప్పటి వరకు 1000కి పైగా సినిమాల్లో నటించారు. ప్రత్యేకమైన కామెడీతో తనదైన శైలితో ప్రేక్షకులను నవ్వించారు. కాగా కమెడియన్ అలీ సతీమణి పేరు జుబేదా సుల్తానా బేగం. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అలీ సతీమణి జుబేదా సుల్తానా బేగం యూట్యూబ్ లో వంటలు చేస్తూ బాగా ఫేమస్ అయ్యారు. కొన్ని సినిమాల్లో నటించి తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించినా రఘు కారుమంచి ప్రస్తుతం జబర్దస్త్ లోనూ నవ్విస్తున్నారు. ఈయనకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

టాలీవుడ్ కమెడియన్, ప్రొడ్యూసర్, యాక్టర్, రైటర్, డైరెక్టర్ ఇలా సినిమా పరిశ్రమలో బహుముఖ ప్రజ్ఞాశాలి గా పేరు తెచ్చుకున్న పోసాని కృష్ణ మురళి నటనతో పాత్రలో జీవిస్తూ ఉంటారు.. ముఖ్యంగా కమెడియన్ పాత్రలో అయితే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు. కాగా పోసాని కృష్ణమురళి భార్య పేరు కుసుమలత. ఈయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్ రెడ్డి భార్య పేరు స్వాతి రెడ్డి.. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Share post:

Latest