చిరంజీవిని ఫోన్లో పరామర్శించిన సీఎం కెసిఆర్..అయన ఏమన్నారంటే ?

టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవికి రెండు రోజులు క్రితమే కరోనా సోకింది. స్వల్ప లక్షణాలు ఉండటంతో టెస్టు చేయించుకోవడంతో పాజిటివ్ వచ్చింది.దీన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన చిరంజీవి తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వెంటనే టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ఎన్టీఆర్ ,నాని ,అల్లు అర్జున్ వంటి హీరోలు అయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా ట్విట్ రూపంలో తెలియజేసారు .

అలాగే రాజకీయ నాయకులూ కూడా చిరంజీవి త్వరగా కోలుకోవాలని పలువురు ట్విట్ రూపంలో ట్విట్ చేశారు .చిరంజీవికి కరోనా సోకిన విషయం తెలిసిన వెంటనే మాజీ సీఎం చంద్రబాబు తో సహా అయన కుమారుడు నారా లోకేష్ సహా పలువురు ట్విట్టర్‌లో త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. గతంలో చంద్రబాబు,లోకేష్ కరోనా బారిన పడినప్పుడు చిరంజీవి కూడా ట్వీట్ చేశారు.

అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ కాస్త డిపెరెంట్ .కెసిఆర్ మాత్రం నేరుగా చిరంజీవికి ఫోన్ చేసి క్షేమసమాచారాలు తెలుసుకొని కొన్ని జాగ్రత్తలు చెప్పారు.రాజకీయాలు వదిలేసాక చిరంజీవి ఫీల్మ్ ఇండస్ట్రీ కోసం రెండు, మూడు సార్లు కేసీఆర్‌తో ప్రగతి భవన్‌లో చిరంజీవి,తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ఇతర టాలీవుడ్ ప్రముఖులతో సమావేశం అయ్యారు. వారి మధ్య మంచి సంబంధాలు ఉండటంతో చిరంజీవిని కెసిఆర్ ఫోన్ లో పరామర్శించారు .

Share post:

Latest