డైరెక్టర్ కొరటాల శివ పై పోలీసులకు ఫిర్యాదు …ఎందుకంటే ?

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ అందరకి తెలిసిందే.ఈయన మెగాస్టార్ చిరంజీవి ,రాంచరణ్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమా ఆచార్య తీస్తున్నది అందరకి తెలిసిందే.ఆచార్య సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉండగా కరోనా దెబ్బకు ఎప్పటికప్పుడు పోస్ట్ పోనే అవుతూ వస్తుంది . అయితే సినిమా ప్రమోషన్ చేస్తున్నారు , ప్రమోషన్లో భాగమంగా లిరికాల్ సాంగ్స్ ఒక్కొక్కటి రిలీజ్ చేస్తున్నారు .

తాజాగా మెగాస్టార్, రెజీనాలపై చిత్రీకరించిన స్పెషల్ నంబర్ ‘శానా కష్టం’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం. అయితే దర్శకుదు కొరటాల శివపై కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ సాంగ్‌లో లిరిక్స్ RMP వృత్తిని అవమానపర్చే విధంగా ఉందని ఆ సంఘం నాయకులు తెలంగాణ రాష్ట్రము జనగామలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘శానా కష్టం’ పాటలో ‘ఏడేడో నిమురోచ్చని కుర్రోళ్ళు ఆర్ఎంపీలు అవుతున్నారు’ అని రాసిన పాట రచయిత, సినిమా దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని RMP సంగం నాయకులు డిమాండ్ చేశారు. RMP, PMPల మనోభావాలు దెబ్బతినే విధోగా ఉన్న ఆ పాట నిలిపివేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, రాం చరణ్ ప్రధాన పాత్రలలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ సంగీత, యంగ్ బ్యూటీ రెజీనా స్పెషల్ సాంగ్స్‌లో సందడి చేయబోతున్నారు. అయితే ఈ ఫిర్యాదుపై దర్శకుడు కొరటాల శివ ,హీరో చిరంజీవి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి .

Share post:

Latest