కేటీఆర్ ఏం స్పెషలా అంటున్న రేవంత్

ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు.. అందులోనూ రాష్ట్ర మంత్రి.. రాష్ట్రంలో ఆయన చెప్పింది జరిగి తీరాల్సిందే.. అతనే కేటీఆర్..అయితే కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ఇపుడు నేరుగా విమర్శణాస్ర్తాలు సంధిస్తున్నాడు. పవర్ ఉన్న వ్యక్తి నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు పట్టించుకోరా అని పోలీసులను ప్రశ్నిస్తున్నాడు. రాష్ట్రంలో సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టమైన ఆదేశాలున్నా పోలీసులు మాత్రం కేసు నమోదు చేయకుండా ఎందుకు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని నిలదీస్తున్నాడు.

కేటీఆర్ పై డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర డీజీపీని కోరారు. శుక్రవారం పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం నల్లగొండలో ఐటీ హబ్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా నల్లగొండకు వెళ్లిన మంత్రికి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో వెళ్లి ఘన స్వాగతం పలికారు. అంతేకాక పెద్ద బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తన వాయిస్ పెంచారు. భూపాలపల్లిలో రైతులతో మాట్లాడేందుకు వెళ్లాలని ప్రయత్నించగా పోలీసులు తనను హౌస్ అరెస్టు చేసి నిబంధనలు అడ్డు వస్తున్నాయని చెప్పి అనుమతించలేదని, మరి ఇపుడు కేటీఆర్ కు ఏ నిబంధనల మేరకు అనుమతిచ్చారని ప్రశ్నిస్తున్నాడు.

తెలంగాణ పోలీసులు ఇలా వ్యక్తిని బట్టి చర్యలు తీసుకోరాదని, ద్వంద్వ నిబంధనలు అమలు చేయరాదని ట్విట్టర్ లో డీజీపీ మహేందర్ రెడ్డిని కోరారు. వెంటనే కేటీఆర్ పై కేసు నమోదు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతోపాటు కోవిడ్ కారణంగా జనవరి రెండవతేదీ వరకు రాష్ట్రంలో ర్యాలీలు,
బహిరంగసభలు నిర్వహించరాదని గత వారమే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలన్నీ ఎందుకు పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి వేలెత్తిచూపుతున్నాడు. మరి పోలీసు అధికారులు రేవంత్ డిమాండుపై ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Share post:

Latest