నడిరోడ్డు పై ప్రధాని.. ప్రపంచం నవ్వుతోంది!!

భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటన పలు వివాదాలకు దారి తీసింది. ఇది వివాదం అనేకంటే ఘోరమైన భద్రతా వైఫ్యలం అనటం కరెక్ట్. ఇక్కడ ముందుగా రెండు విషయాలు చెప్పదలచుకున్నాను. ఒకటి మనమందరం కచ్చితంగా ఒప్పుకు తిరాల్చిన అంశం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనలో భాగంగా నట్ట నడిరోడ్డు లో ఒక ఫ్లైఓవర్ పైన రైతుల నిరసన కారణంగా దేశ ప్రధాని 20 నిమషాల పాటు వేచి చూసి పర్యటనను రద్దుచేసుకుని తిరిగి వెనక్కి వెళ్లిన సంఘటన. రెండవది పంజాబ్ లో జరగనున్న రాబోవు ఎన్నికలను దృష్టి లో ఉంచుకుని ఎప్పటిలాగే బీజేపీ, ప్రధానమంత్రి క్రియేట్ చేసిన అతిపెద్ద డ్రామాగా దీనిని కొంతమంది అభివర్ణిస్తున్నారు.

సరే ఇది నిజంగా డ్రామానే అనుకుందాం అయినప్పటికీ ప్రపంచదేశాల దృష్టిలో నిన్న జరిగిన సంఘటన ఒక మాయని మచ్చగా మిగిలిపోతుంది. భారతదేశ ప్రధానిగా వుండి దేశం లోని ఒక రాష్ట్ర పర్యటనకు వెళ్ళితే పర్యటనను అర్ధాంతరంగా రద్దుచేసుకుని రావటం, అందులోనూ ఆందోళనల కారణంగా ఫ్లైఓవర్ పైన దాదాపు 20 నిమిషాల పాటు ప్రధానమంత్రి వేచిచూసి చివరకు నిస్సహాయతతో వెనుతిరగటం అనేది ప్రపంచ వ్యాప్తంగా వెళ్లిన వార్త. దీనికి మనమందరం సిగ్గుపడాలి. ఇది రాజకీయ కోణంలో చూసినా, ఇంకోకోణంలో చూసినా ఇది కచ్చితంగా భారత దేశానికి సిగ్గుచేటయిన అంశం దీనిని ప్రతి ఒక్కరు ఖండించి తీరాలి. బీజేపీ ఈ విషయాన్నీ దేనికైనా వాడుకోవచ్చుగాక కానీ ఒక భారత ప్రధానిని అడ్డగించి వెనక్కి పంపటమనేది హేయమయిన చర్య. అది రైతులు కావచ్చు ఇంకే ఉద్యమ కారులైనా కావొచ్చు కచ్చితంగా మనమందరం ఖండించాలి.

మనకు మనకు అంతర్లీనంగా ఎన్ని సమస్యలు, వివాదాలైన ఉండొచ్చుగాక! కానీ ఈ విషయాన్నీ అంతర్జాతీయ కోణంలో చూస్తే కచ్చితంగా ఇది మనకు తలఒంపులు తెచ్చే ఘటనే. ఇక్కడ ఇంకా లోతుగా చూస్తే ఒక భారతదేశ ప్రధానమంత్రి ఒక రాష్ట్ర పర్యటనకు వస్తే ఆ రాష్ట్ర గవర్నర్, సీఎం, ఇతర ఉన్నతాధికారులు తప్పక ఆహ్వానం పలకాలి అదే ఇతర నగరాల్లోకి వస్తే ప్రభుత్వం తరపున సీఎం లేదా ఒక మంత్రి తో పాటు ఉన్నతాధికారులు హాజరవుతారు. కానీ ఈ పర్యటనలో కేవలం ఆర్ధిక మంత్రి మాత్రమే స్వాగతం పలికారు. సీఎం, సీఎస్,డీజీపీ స్వాగతించటానికి రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్ధిక మంత్రి స్వాగతం పలికినా, కేంద్ర సర్వీసులకు చెందిన డీజీపీ కానీ చీఫ్ సెక్రిటరీ కానీ ఎందుకు రాలేదన్నది ప్రధాన ప్రశ్న? ఎన్నికల సందర్భంగా ఎవరెన్ని విమర్శలు చేసినా సహించగలం కానీ భారతదేశ సమగ్రతకు భంగం కలిగించే ఇటువంటి నీచ రాజకీయాలు ఏ పార్టీ చేసినా, ఏ వర్గం చేసినా, ఏ ఆందోళనకారులు చేసినా ఎంతమాత్రం క్షమార్హం కానే కాదు.

దాడి కాంగ్రెస్ కోణం లో కాంగ్రెస్ కి ఒక వాదం వుంది, బీజేపీ కోణంలో బీజేపీ కి ఒకవాదం ఉంది కానీ భారతీయులమంతా ఈ దాడిని చూడాలసింది భారత ప్రధానిని నిలువరించారు అనేకోణం లోనే చూడాలి. ప్రపంచ దేశాలన్నీ కూడా దీనిని ఇదే కోణం నుంచి చూస్తాయి. భారతీయ ప్రధానమంత్రి భారతదేశంలోనే ఒక ప్రాంతంనుంచి ఇంకొక ప్రాంతానికి స్వేచ్ఛగా వెళ్లలేకపోతున్నాడు ఇటువంటి సమాజంలోన భారతదేశ ప్రజాస్వామ్యం జీవించేది అన్న ప్రశ్న ప్రపంచదేశాలలో తలెత్తుతుంది. ఇటువంటి ఘటనలు పునరావృతం అయితే ఖచ్చితంగా అంతర్జాతీయ సమాజంలో మనల్ని మనమే తక్కువ చేసుకున్నవాళ్లమవుతాం. ఇప్పటికైనా ఆరోపణలు, నిందలు, ఎదురుదాడులు మాని కనీసం అంతర్జాతీయ సమాజంలో మనం ఇటువంటి తలదించుకునే చర్యలు చేయకుండా సంయమనం పాటించాలని కోరుకుందాం..జైహింద్.
—కల్కి