ఆ సినిమాలు చేసి ఉంటే ప్రభాస్ రేంజ్ మరోలా ఉండేది..

ప్రభాస్.. పాన్ ఇండియన్ హీరో. బాహుబలి సినిమాతో భారతీయ సినిమా పరిశ్రమలో టాప్ హీరోగా మారిపోయాడు. ఇంకా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఆయన పాపులారిటీ వచ్చింది. ఈ సినిమా తర్వాత ఆయన వరుస సినిమాలతో ముందుకు సాగుతున్నాడు. అవన్నీ పాన్ ఇండియా రేంజ్ మూవీసే కావడం విశేషం. అయితే బాహుబలి సినిమా కంటే ముందుకు ఈ యంగ్ హీరో.. ఐదు బ్లాక్ బస్టర్ సినిమాలను వదులుకున్నాడట. ఆయన వదులుకున్న సినిమాలు మిగతా హీరోల కెరీర్ ను టర్న్ చేశాయట. ఇంతకీ తను వదులుకున్న సినిమాలేంటి? ఆ సినిమాలతో కెరీర్ టర్న్ అయిన హీరోలు ఎవరు? అనే విషయాన్ని ఇఫ్పుడు తెలుసుకుందాం..

రవితేజ నటించిన సూపర్ హిట్ మూవీ కిక్. 2009లో సురేందర్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా కథను ముందుగా ప్రభాస్ కు చెప్పాడట. అయితే తను ఏవో కారణాలు చెప్పి వదులుకున్నాడట. అటు అల్లు అర్జున్ నటించిన ఆర్య సినిమా కథను ముందుగా సుకుమార్ ప్రభాస్ కు చెప్పాడట. అయితే ఈ కథ తనకు అంతగా నచ్చలేదట. ఇదే సినిమాను బన్నీ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

అటు మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఒక్కడు సినిమా ఆఫర్ కూడా ముందుగా ప్రభాస్ కే వచ్చిందట. ఇందులో కబడ్డీ గేమ్ తను ఆడలేనని చెప్పి వద్దన్నాడట. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ ను మలుపు తిప్పింది. అటు జూనియర్ ఎన్టీఆర్ కు మంచి గ్రోత్ ఇచ్చిన మూవీ సింహాద్రి. ఈ సినిమాను కూడా ముందుగా ప్రభాస్ కే చెప్పాడట రాజమౌళి. అయితే డేట్స్ ఖాళీగా లేని కారణంగా తను ఈ సినిమాను వదలుకున్నాడట. అటు రాంచరణ్ నటించిన నాయక్ సినిమా ఆఫర్ కూడా ముందుగా ప్రభాస్ కే వచ్చిందట. అయితే ఆ సమయంలో మరో మూవీ చేయడంతో ఈ సినిమాను చేయలేనని చెప్పాడట. మొత్తంగా పలు రకాల కారణాలో బ్లాక్ బస్టర్ సినిమాలను వదులుకున్నాడు ప్రభాస్.