ఆఫీసియల్: బాలయ్య కొత్త సినిమాకు విలన్ ఫైనల్

అఖండ మూవీ బ్లాక్ బస్టర్ విజయంతో పుల్ జోష్ ఉన్న బాలకృష్ణ ,క్రాక్ హిట్ సినిమాతో మంచి ఊపుతో ఉన్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ బ్యానర్ లో వస్తున్న చిత్రం మన అందరకి తెలిసిందే .ఈ చిత్రం లో కధానాయిక గా శృతి హాసన్ ఎంపిక చేసిన చిత్ర బృందం .ప్రతి నాయకుడు కోసం ఇప్పుడు వరకు అనేక మందిని వెతికిన చిత్ర బృందం ఒకానొక టైం లో హీరో అర్జున్ ని కధానాయకు అనుకున్న చివరకు కనడ నటుడు దునియా విజయ్ ని ఎట్టకేలకు ఫైనల్ చేసింది చిత్ర బృందం .

ఈ కనడ నటుడు దునియా విజ‌య్ తెలుగులో న‌టిస్తున్న తొలి చిత్ర‌మిదే. బ్లాక్ బస్టర్ అఖండ త‌ర‌వాత బాల‌య్య‌ చేస్తున్న సినిమాపై ఇప్పిటికే భారీ ఆశలు పెట్టుకున్న అభిమానులు.సంక్రాంతి త‌ర‌వాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌బోతోంది. ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రిషి పంజాబీ కెమెరామెన్‌గా ప‌నిచేయ‌బోతున్నారు. ఇంకా టైటిల్ ఖ‌రారు చేయ‌లేదు చిత్ర బృందం. బాలయ్య తో సినిమా కాబ‌ట్టి, పక్క మాస్ ప‌వ‌ర్‌ఫుల్‌టైటిల్ కోసం అన్వేషిస్తోంది చిత్ర‌బృందం.

Share post:

Latest