రాజమౌళి సినిమాల్లో కామన్ పాయింట్ మీరు గుర్తించారా?

ఎస్ ఎస్ రాజమౌళి.. టాలీవుడ్ మాత్రమే కాదు.. యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే పరిచయం అవసరం లేని దర్శకుడు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రాజమౌళి.. ఇప్పటి వరకు తాను తీసిని సినిమాలన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆయన కెరీర్ లో ఓటమి అనే మాటే లేదని చెప్పుకోవచ్చు. అయితే ఆయన తీసిన ప్రతి సినిమాకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఒకదానిని మించిన కథతో మరొకటి ముందుకు వస్తుంది. అయితే ఆయన సినిమాలన్నింటిలో ఓ కామన్ పాయింట్ ఉంటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

రాజమౌళి సినిమాలోని కామన్ పాయింట్ మరేంటో కాదు.. ఆయుధం. జూనియర్ ఎన్టీఆర్ తీసిన సింహాద్రి సినిమాలో జక్కన్న చూపించిన ఆయుధం ఎంతో ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన ఛత్రపతి, విక్రమార్కుడు సినిమాల్లోనూ ప్రత్యేక ఆయుధాలను చూపించాడు. ఇక మగధీర సినిమాలోని ఖడ్గం కూడా బాగా ఫేమస్ అయ్యింది. బాహుబలి సినిమాలోనూ ప్రభాస్ ఖడ్గం, రానా గద చాలా గుర్తింపు తెచ్చుకున్నాయి. తాజాగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలోనూ కొత్త ఆయుధాలను పరిచయం చేస్తున్నాడట రాజమౌళి.

అంతేకాదు.. రాజమౌళి సినిమాల్లో లాకెట్స్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ మెడలో పులిగోరు ఉంటుంది. అనంతరం వచ్చిన ఛత్రపతి సినిమాలో ప్రభాస మెడలో శంఖం కనిపిస్తుంది. అటు యమదొంగ సినిమాలోనూ ఎన్టీఆర్ మెడలో లో లాకెట్ కనిపిస్తుంది. అటు బాహుబలి సినిమాలో ప్రభాస్ మెడలో శివలింగం కనిపిస్తుంది. తాజాగా మూవీ త్రిఫుల్ ఆర్ లో రాంచరణ్ మెడలో ఓంకారం లాకెట్ కనిపిస్తుంది. అటు రాజమౌలి సినిమాల్లో ప్రతి హీరోకు ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ప్రస్తుతం సాధారణ జీవితం గడిపే వ్యక్తులకు గతంలో అసాధారణ రీతిలో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. మొత్తంగా రాజమౌళి కొత్త తరహా సినిమాలను తీస్తూనే కొన్ని ప్రత్యేకతలను అలాగే కంటిన్యూ చేస్తున్నాడు. ఆయన తీసిన సినిమాలన్నీ మంచి జనాదరణ దక్కించుకుంటూనే ఉన్నాయి.