RRR కి పోటీగా బరిలో నిలవనున్న 6 సినిమాలు..అంత దమ్ము ఎక్కడిది ?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా సినిమా ఆర్ఆర్ఆర్.. ఈ సినిమా ఈనెల లోనే విడుదల కావాల్సి ఉంది. జనాలు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూశారు కూడా. అయితే ఏంజరిగిందో తెలియదు కానీ.. చివరి నిమిషంలో సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా వాయిదాతో మిగతా సినిమాల లెక్కలు పూర్తిగా మారిపోయాయి. ఎప్పుడెప్పుడో రావాల్సిన సినిమాలన్నీ సంక్రాంతి బరిలో నిలిచాయి. అటు సమ్మర్ సినిమాలపై నా మూవీ మేకర్స్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. అటు త్రిఫుల్ ఆర్ సినిమా మూలంగా చాలా మంది నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల పలు సార్లు వాయిదా పడింది. దీంతో ఆయా సినిమాల నిర్మాతలు తమ ప్లాన్ ను మార్చుకోలేకపోతున్నారు. రాజమౌళి సినిమా రిలీజ్ డేట్ ప్రకటించాక చాలా సినిమాలు సైడ్ అవుతుంటాయి. చివరి నిమిషంలో సినిమా వాయిదా వేస్తున్నట్లు చెప్తాడు రాజమౌళి. దీంతో సమ్మర్ బరిలోకి ఈ సినిమా తీసుకెళ్లాడు. అయితే ఈ సినిమాతో పోటీ పడలేక మళ్లీ పలువురు నిర్మాతలు తమ సినిమాలను వాయిదా వేసుకుంటున్నారు. అయితే త్రిఫుల్ ఆర్ తో ఢీకొట్టేందుకు పలు సినిమాలు రెడీ అవుతున్నాయి. ఇంతకీ ఆ సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

* కేజియఫ్ 2
పాన్ ఇండియన్ మూవీగా విడుదల కాబోతుంది కేజియఫ్ 2. ఏప్రిల్ 14న ఈ సినిమా జనాల ముందుకు రాబోతుంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. ఇందులో యశ్ హీరో కాగా.. సంజయ్ దత్ మెయిన్ విలన్. తెలుగుతో పాటు దేశంలోని అన్ని భాషల్లో ఈ సినిమా ఒకే రోజు రిలీజ్ కాబోతుంది.

* సర్కారు వారి పాట
అటు ఏప్రిల్ 1న మహేష్ బాబు సర్కారు వారి పాట రిలీజ్ కానుంది. పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా చేస్తుంది.

* బీస్ట్
దళపతి విజయ్ హీరోగా చేస్తున్న ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కూడా సమ్మర్ లోనే రిలీజ్ కానుంది.

* లాల్ సింగ్ చడ్డా
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా మూవీ ఎప్రిల్ 14న విడుదల కానుంది. ఇందులో నాగ చైతన్య కీరోల్ పోషిస్తున్నాడు.

* ఎఫ్ 3
అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఎఫ్ 3 మూవీ కూడా సమ్మర్ బరిలో నిలిచింది. దాదాపు రూ. 80 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించారు.