ఈ ఏడాది భారత్ లో విడుదల కానున్న 6 హాలీవుడ్ మూవీస్ ఇవే..

January 5, 2022 at 3:41 pm

అన్ని సినిమా పరిశ్రమల మాదిరిగానే హాలీవుడ్ మీద కూడా కరోనా ప్రభావం భారీగా పడింది. తాజాగా విడుదల అయిన స్పైడర్ మ్యాన్-No Way Home మూవీ సైతం అద్భుతంగా ఆడింది. ప్రపంచ వ్యాప్తంగా జనాలను బాగా ఆకట్టుకుంది. కరోనా అనంతరం వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది. అయితే మిగతా దేశాలతో పోల్చితే భారత్ లో ఈ సినిమాను జనాలు అద్భుతంగా ఆదరించారు. ఈ సినిమా అనే కాదు.. ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి వచ్చే చాలా సినిమాలను కూడా భారతీయులు బాగా ఆదరిస్తారు. అయితే ఈ ఏడాది కూడా పలు హాలీవుడ్ సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. ఇంతకీ భారత్ లో 2022లో విడుదల కాబోతున్న సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

*ది బ్యాట్ మ్యాన్
బ్యాట్ మ్యాన్ కు కొనసాగింపుగా ఈ సినిమా వస్తుంది. ఈ ఏడాది మార్చిలో ఈ సినిమా జనాల ముందుకు రాబోతుంది. ఇందులో రాబర్ట్ పాటిన్సన్ ఈ సూపర్ హీరో క్యారెక్టర్ చేశాడు. గోథమ్ సిటీని విలన్ల దాడి నుంచి కాపాడేందుకు బ్యాట్ మ్యాన్ చేసే సన్నివేశాలు జనాలను ఆకట్టుకోనున్నాయి.

* డాక్టర్ స్ట్రేంజ్
మార్వెల్ సినిమాల కొనసాగింపుగా ఈ సినిమా జనాల ముందుకు వస్తోంది. మంచి కథ అంతకు మించి యాక్షన్ సీన్లు జనాలను ఆకట్టుకోనున్నాయి. ఈ సినిమా మేలో విడుదల కానుంది.

*జురాసిక్ వరల్డ్
జురాసిక్ పార్క్ సినిమాలకు కొనసాగింపుగా ఈ సినిమా వస్తుంది. డైనోసార్ల మూలంగా భూమిపై మనుషుల మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుంది. అయితే వాటి నుంచి మనుషులు ఎలా తప్పించుకున్నారు? అనేది సినిమా స్టోరీ ఈ సినిమాలో క్రిస్ ప్రాట్, బ్రైస్ హోవార్డ్ మెయిన్ రోల్స్ చేశారు.

*మిషన్ ఇంపాజిబుల్-7
ఇప్పటికి ఆరు భాగాల్లో జనాలను అలరించిన హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూయిజ్ తాజాగా ఈ సినిమాతో జనాల ముందుకు వస్తున్నాడు. అటు ఈ సినిమాకు సంబంధించిన పలు యాక్షన్ సీన్లను సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ సీన్లు జనాలను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదల కానుంది.

*స్పైడర్ మ్యాన్ అక్రాస్ ది స్పైడర్
స్పైడర్ మ్యాన్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. తాజాగా ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ లో జనాల ముందుకు ఈ సినిమా రానుంది.

*బ్లాక్ పాంథర్..
ఈ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న మూవీ Black Panther: Wakanda Foreve. గతంలో ఈ సిరీస్ లో వచ్చిన పలు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అటు ఈ సినిమా హీరో చద్విక్ బొస్మాన్ కాన్సర్ తో చనిపోయాడు. అయినా ఈ సినిమాను కొనసాగించారు.

*అవతార్-2
ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా అవతార్-2. జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ లో విడుదల చేయనున్నారు.

ఈ ఏడాది భారత్ లో విడుదల కానున్న 6 హాలీవుడ్ మూవీస్ ఇవే..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts