అనుష్క పవర్ ఫుల్ కంబ్యాక్.. మెగాస్టార్ తో జోడీకి ఓకే చెప్పేనా?

అనుష్క శెట్టి.. బాహుబలి సినిమాతో స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని గుర్తింపు తెచ్చుకుంది. ప్రభాస్ కు సిల్వర్ స్క్రీన్ జోడీగా మంచి పేరు సంపాదించుకున్న ఈ అమ్మడు.. ఎన్నో సక్సెస్ సినిమాల్లో నటించింది. అందంతో పాటు అభినయంతో తెలుగు జనాలకు మరింత దగ్గరైంది. అయితే తనకు ఎంతో గుర్తింపు తెచ్చిన బాహుబలి సినిమా తర్వాత ఈ బ్యూటీ అంతగా సినిమాల్లో నటించడం లేదు. వాస్తవానికి బాహుబలి తర్వాత ఓరేంజిలో అవకాశాలు అందుకుంటుంది అనుకున్నారు. కానీ ఎందుకో తను అంతగా సినిమాలు చేయడం లేదు. బాహుబలి సినిమా తర్వాత తను కేవలం రెండు సినిమాలు మాత్రమే చేసింది. అందులో ఒకటి భాగమతి కాగా మరొకటి నిశ్శబ్దం. ఆ తర్వాత తను మరే సినిమాకు ఓకే చెప్పలేదు. అయితే ఇక తను సినిమాల్లో నటించదని కొన్ని వార్తలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో తనకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

 

ఇప్పటి వరకు గ్యాప్ తీసుకున్న జేజమ్మ తర్వాలోనే వెండితెరపై కనిపించబోతుందని తెలుస్తోంది. అది కూడా మెగాస్టార్ చిరంజీవి సరసన ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో ఇప్పటికే ఓరేంజిలో క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సైజ్ జీరో లాంటి సినిమాల్లో నటించి ఎలాంటి పాత్రల్లోనైనా అనుష్క ఒదిగిపోతుందని నిరూపించుకుంది. నవీన్ పొలిశెట్టి సినిమాలో చేయబోతున్నట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. తాజాగా చిరంజీవితో జతకట్టబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలు చేస్తున్నాడు. ఆచార్య సినిమాలో కాజల్ తో స్టెప్పులు వేశాడు. గాడ్ ఫాదర్ లో సినిమాలో నయనతారతో రొమాన్స్ చేయబోతున్నాడు. భోలా శంకర్ లో తమన్నాతో కలిసి నటిస్తున్నాడు. బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో శ్రుతి హాసన్ మెరువబోతుంది. తాజాగా ప్రకటించిన వెంకీ కుడుముల సినిమాలో అనుష్క అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారట. ఈ సినిమాలో నటించేందుకు అనుష్కను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడట దర్శకుడు వెంకీ. ఇంతకీ అనుష్క ఈ సినిమా చేస్తానంటుందో? లేదో? వేచి చూడాలి.

Share post:

Popular