బన్నీని అలా బుక్ చేస్తున్న బోయపాటి!

January 3, 2022 at 6:25 pm

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించడంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీ పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహకందని వసూళ్లను రాబట్టింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడమే కాకుండా, బన్నీకి మరో సూపర్ హిట్ బ్లాక్‌బస్టర్‌ను అతడి ఖాతాలో వేసింది. ఇక ఈ సినిమా ఇంకా థియేటర్లలో రన్ అవుతుండగానే బన్నీ తన నెక్ట్స్ చిత్రంపై ఫోకస్ పెట్టాడు.

మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బన్నీ తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సరైనోడు’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందనగానే ఇండస్ట్రీ వర్గాల్లో ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ముఖ్యంగా ఈ సినిమా కథలో బన్నీ పాత్రపై ఇండస్ట్రీ వర్గాల్లో ఓ అదిరిపోయే వార్త జోరుగా వినిపిస్తోంది. బోయపాటి శ్రీను మరోసారి పక్కా కమర్షియల్ కథను బన్నీ కోసం రెడీ చేసినట్లు తెలుస్తోంది. అంతేగాక ఈ సినిమాలో బన్నీ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండటమే కాక, ఈ సినిమాలో ఆయన డ్యుయెల్ రోల్‌లో నటిస్తాడని తెలుస్తోంది.

ఇక మరో విశేషమేమిటంటే ఈ సినిమాలో బన్నీ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా కోసం బోయపాటి ఎలాంటి కథను రెడీ చేస్తున్నాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించేందుకు బన్నీ అండ్ బోయపాటిలు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్, మిగతా నటీనటుల గురించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏదేమైనా తనకు ఎంతో కలిసివచ్చిన మాస్ అంశాలను ఏమాత్రం మిస్ కాకుండా వరుసగా చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్న బన్నీకి బోయపాటి ఈసారి ఎలాంటి సక్సెస్‌ను కట్టబెడతాడో చూడాలి.

బన్నీని అలా బుక్ చేస్తున్న బోయపాటి!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts