ఆ ఇమేజ్ కోసం తారక్ తహతహ.. అందుకోసం ఏకంగా 200 కోట్లు వదులుకున్నాడు!

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమా గా 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పై ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి సినిమా తో వరల్డ్ వైడ్ హిట్ కొట్టి వసూళ్లతో సునామీ సృష్టించిన రాజమౌళి ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో కొత్త చరిత్ర సృష్టించబోతున్నారు అంటూ అందరూ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాతో దశ దిశ పెరిగిపోతుందని స్టార్ హీరోగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ కూడా బలంగా నమ్ముతున్నాడటా.

అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమా తెరకెక్కడం దగ్గర నుంచి విడుదల వరకు కూడా అంత ప్రేక్షకులకు నిరాశే మిగులుతుంది. సాధారణంగా రాజమౌళి సినిమా అంటే ఆలస్యం జరుగుతుంది అన్నది తెలిసిందే. కానీ కరోనా వైరస్ కారణంగా ఇంకా ఈ సినిమా ఆలస్యం అవుతు ఉంది. ఇప్పటికి రాజమౌళి సినిమాకు కట్టుబడి ఉండడం తో జూనియర్ ఎన్టీఆర్ లు ఇతర సినిమాల వైపు ఇంకా వెళ్లలేదు. నాలుగేళ్లుగా ఒక్క సినిమా కూడా చేయలేదు. దృష్టి ఆర్ఆర్ఆర్ పైన పెట్టాడు. ఇక ఇటీవల జనవరి 7వ తేదీన విడుదలవుతుంది అనుకున్న త్రిబుల్ ఆర్ సినిమా మళ్లీ వాయిదా పడింది. ఎప్పుడు విడుదల అవుతుంది అన్న దానిపై కూడా క్లారిటీ లేదు.

 

దీంతో అభిమానులు నిరాశలో మునిగిపోయారు. అయితే ఇక ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా లెవెల్ వస్తుంది అని ఆశపడి 200 కోట్లు వదులుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే నాలుగేళ్లలో దాదాపు నాలుగు సినిమాలు చేసేవాడు ఎన్టీఆర్. ఒక సినిమాకి 50 కోట్లు తీసుకున్న.. మొత్తం రెండు వందల కోట్లు సంపాదించేవాడు. కానీ పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ సంపాదించడం కోసం రాజమౌళి సినిమా కి కట్టుబడి ఉన్నాడు ఎన్టీఆర్. మరి ఆర్ఆర్ఆర్ విడుదలైన తర్వాత ఎన్టీఆర్ కెరియర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి మరి.

Share post:

Popular