ప్రదీప్‌తో `పెళ్లి చూపులు`..ఆ కోరిక తీర‌కుండానే యువ న‌టి మృతి!

ఫేమస్ యూట్యూబర్, యువ న‌టి శ్రియ మురళీధర్ గుండె పోటుతో మృతి చెందారు. హైదరాబాద్ లో లక్డీకాపూల్ లో నివాసం ఉంటున్న శ్రియ‌ మురళీధర్ సోమవారం రాత్రి కార్డియాక్ అరెస్ట్‌కి గుర‌వ‌డంతో.. కుటుంబ స‌భ్యులు ఆమెను హుఠాహుఠిన హాస్ప‌ట‌ల్‌కి త‌ర‌లించారు. కానీ మార్గం మ‌ధ్య‌లోనే శ్రియా తుది శ్వాస విడిచింది. ఆమె వ‌య‌స్సు కేవ‌లం 27 సంవత్సరాలే.

చిన్న వ‌య‌సులోనే శ్రియా మృతి చెంద‌డంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు క‌న్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే బుల్లితెర స్టార్ యాంక‌ర్‌, హీరో ప్ర‌దీప్ మాచిరాజు `పెళ్లి చూపులు`రియాలిటీ షోలో శ్రియ మురళీధర్ కూడా ఒక కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఈ షో ద్వారా గుర్తింపు సంపాదించుకున్న శ్రియ‌.. ఆ త‌ర్వాత ప‌లు షార్ట్ ఫిల్మ్స్‌లో న‌టించింది.

వాట్ ద ఫ‌న్ అనే యూట్యూబ్ ఛాన‌ల్‌లో ఆమె చేసిన వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి. అలాగే త్వ‌ర‌లో బిగ్ స్క్రీన్‌పై కూడా ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ సంపాదించుకోవాల‌ని శ్రియ కోరుకుంది. కానీ, ఆ కోరిక తీర‌కుండానే తిరిగి రాని లోకాల‌కు వెళ్లిపోవ‌డంతో.. అంద‌రూ విషాదంలో మునిగిపోయారు.

https://www.instagram.com/p/BpLmvVNhzUd/?utm_source=ig_web_copy_link

Share post:

Popular