సూసైడ్ చేసుకోవాల‌నుకున్న‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..కార‌ణం అదేన‌ట‌?!

మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడిగా తెలుగు సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. సొంత టాలెంట్‌లో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ క్ర‌మంలోనే త‌న‌దైన న‌ట‌న‌, మేన‌రిజ‌మ్స్ తో కోట్లాది ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానులుగా మార్చుకున్న ప‌వ‌న్‌.. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు, మ‌రోవైపు రాజ‌కీయాలు చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతున్నాడు.

ఇక ఏ విష‌యంలో అయినా ఎంతో ధైర్యంగా ఉండే పవన్ గతంలో సూసైడ్ చేసుకుని చనిపోవాలనుకున్నాడ‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. అస‌లు ప‌వ‌న్ ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకోవ‌డానికి కార‌ణం ఏంటీ..? ఎందుకు ఆయ‌న అంత పెద్ద నిర్ణ‌యం తీసుకున్నాడు..? వంటి విష‌యాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1984లో పదవ తరగతి పూర్తి చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఆ త‌ర్వాత ఇంట‌ర్ చేసి ఫెయిల్ అయ్యారు. ఇంట‌ర్ ప‌రీక్ష‌ల్లో ఫెయిల్ అవ్వ‌డంతో తీవ్ర నిరాశ‌కు గురైన ప‌వ‌న్‌.. అన్న చిరంజీవి పిస్తోలుతో కాల్చుకొని చనిపోదాం అనుకున్నాడట. ఆ స‌మ‌యంలో ప‌వ‌న్‌ను గ‌మ‌నించిన‌ చిరంజీవి.. ఆయ‌న్ను గ‌ట్టిగా మంద‌లించార‌ట‌.

అలాగే ప‌వ‌న్‌లో థైర్యాన్ని నింపిన చిరు.. జీవితంలో ఎన్ని క‌ష్టాలు ఎదురైనా ముందుకు ఎలా సాగాలో వివ‌రించార‌ట‌. ఈ విష‌యాన్ని గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేసిన ప‌వ‌న్‌.. ఆ నాడు అన్నయ్య చిరంజీవి చెప్పిన మాటలే తనలో విశ్వాసాన్ని నింపాయని.. ఇప్పుడు ఈ స్థితిలో ఉండడానికీ ఆయ‌నే కార‌ణ‌మ‌ని తెలిపారు. అంతేకాదు, మా అన్న లాంటి అన్నయ్య ప్రతి ఇంట్లో ఉంటే ఆత్మహత్యలే జరగవని చెప్పుకొచ్చారు.

Share post:

Popular