మహేష్ కి సర్జరీ..’సర్కారు వారి పాట’ మరింత లేట్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తిసురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్, 14రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నాయి. ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉండగా.. షూటింగ్ డిలే కావడంతో సమ్మర్ కానుకగా ఏప్రిల్ ఒకటవ తేదీ విడుదల చేస్తామని ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. అయితే సర్కారు వారి పాట సమ్మర్ లో లో అయినా విడుదల అవుతుందా లేదా అన్నది సందేహంగా మారింది.

ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా తుది షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. అయితే కొద్ది రోజులుగా మహేష్ బాబు మోకాలు కు సంబంధించిన సమస్యతో ఇబ్బంది పడుతున్నారని సమాచారం. ఆ సమస్య మరింత పెద్దది కావడంతో సర్జరీ చేయించుకోవాలని మహేష్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సర్జరీ కోసం మహేష్ బాబు షూటింగ్ కి బ్రేక్ ఇస్తున్నారు.

మోకాలు సర్జరీ చేయించుకున్న తర్వాత మహేష్ బాబు కనీసం రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు తెలుస్తోంది. ఆయన కోలుకున్న తర్వాతే సర్కారు వారి పాట మిగిలిన షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సర్కారు వారి పాట సినిమా పూర్తయిన తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ లో నటించాల్సి ఉంది.

Share post:

Latest