స‌మంత కీల‌క నిర్ణయం..త్వ‌ర‌లోనే బిగ్ అనౌన్స్మెంట్?

December 1, 2021 at 2:57 pm

భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి విడిపోయి అక్కినేని కుటుంబంతో తెగ‌దెంపులు చేసుకున్న టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత‌.. ప్ర‌స్తుతం కెరీర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టి న‌చ్చిన సినిమాల‌ను ఒప్పుకుంటూ పోతోంది. ఇప్ప‌టికే గుణశేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `శాకుంత‌లం`ను పూర్తి చేసిన సామంత‌.. ఇటీవ‌ల రెండు ద్వి భాషా చిత్రాల‌ను అనౌన్స్ చేసింది.

ఇవి ఇంకా సెట్స్ మీద‌కు వెళ్ల‌కుండానే ఏకంగా ఓ హాలీవుడ్ చిత్రాన్ని ప్ర‌క‌టించింది. `అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్ ల‌వ్‌` అనే పుస్తక కథ ఆధారంగా తెరకెక్కనున్న ఓ ఇంగ్లీష్ సినిమాతో సామ్ హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. ఫిలిప్‌ జాన్‌ అనే హాలీవుడ్ దర్శకుడు తెర‌కెక్కించ‌బోతున్న ఈ చిత్రాన్ని.. `ఓ బేబీ`కి కో ప్రొడ్యూసర్ గా ఉన్న సునీత తాటి నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా బాలీవుడ్‌కు చెందిన అగ్ర నిర‍్మాణ సంస్థ యష్‌ రాజ్‌ ఫిలిమ్స్‌ సమంతతో చర‍్చలు జరుపుతున్నార‌ట‌. ఇందులో భాగంగా ఒకేసారి మూడు సినిమాలకు ఒప్పందం చేసుకునేందుకు సామ్‌కు ప్రపోజల్‌ పెట్టారట ఆ నిర్మాణ సంస్థవాళ‍్లు. అంతే కాదు, భారీ రెమ్యూన‌రేష‌న్ కూడా ఆఫ‌ర్ చేశార‌ట‌.

దాంతో స‌మంత ఆ నిర్మాణ సంస్థ‌లో మూడు సినిమాలు చేసేందుకు ఓకే చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు టాక్ న‌డుస్తోంది. ఇక త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై బిగ్ అనౌన్స్మెంట్ సైతం రానుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారంలో ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

స‌మంత కీల‌క నిర్ణయం..త్వ‌ర‌లోనే బిగ్ అనౌన్స్మెంట్?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts