స‌మంత‌ న్యూఇయర్ సెలబ్రేషన్స్.. ఈసారి ఎవ‌రితోనో తెలుసా?

గ‌త కొన్నేళ్ల నుంచీ టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా స‌త్తా చాటుతున్న స‌మంత‌.. ఇటీవ‌లె భ‌ర్త నాగ‌చైత‌న్య‌కు విడాకులు ఇచ్చి అక్కినేని కుటుంబంతో తెగదెంపులు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. కొన్నేళ్ల పాటు ప్రేమించుకుని ఆ త‌ర్వాత పెద్ద‌ల‌ను ఒప్పించి ఆపై అంగ‌రంగ వైభ‌వంగా పెళ్లి చేసుకున్న ఈ జంట‌.. నాలుగేళ్లు గ‌డ‌వ‌క ముందే వైవాహిక జీవితానికి పులిస్టాప్ పెట్టేసి అంద‌రికీ షాక్ ఇచ్చారు.

- Advertisement -

ఇక ప్ర‌స్తుతం ఒంట‌రిగానే ఉంటున్న సామ్‌.. వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్నెల్ ఇస్తూ కెరీర్ ప‌రంగా దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. మ‌రికొన్ని గంట‌ల్లో న్యూ ఇయ‌ర్ రాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే అంద‌రూ న్యూ ఇయ‌ర్‌ను సెల‌బ్రేట్ చేసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే పెళ్లైన ద‌గ్గ‌ర నుంచీ సామ్ భ‌ర్త చైతుతో న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ కోసం వెకేష‌న్‌కి వెళ్లేది.

కానీ, ఆమెకు తోడుగా ఇప్పుడు చైతు లేడు. దీంతో సామ్ ఈసారి ఎవ‌రితో న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేట్ చేసుకుంటుందా అన్న ఆస‌క్తి ఎంద‌రిలోనూ ఉంది. అయితే చైతుతో విడిపోయాక సమంత‌కు అన్ని రకాలుగా వెంట ఉండి తన కష్ట, సుఖాలను పంచుకుంది తల్లిదండ్ర్లు, స్నేహితులే. అందుకే, ఈ న్యూఇయర్ వేడులను తన తల్లి, స్నేహితులు.. మ‌రియు తన పెట్ డాగ్స్‌తో కలిసి జరుపుకోనుందట.

ఈ విషయాన్ని సమంత ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. కాగా, సమంత సినిమా విష‌యానికి వ‌స్తే.. ఇప్ప‌టికే ఈమె న‌టించిన `శాకుంత‌లం` చిత్రం విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. మ‌రోవైపు సామ్ తెలుగు, త‌మిళ చిత్రాల‌తో పాటు బాలీవుడ్‌, హాలీవుడ్ సినిమాల‌కు సైతం సైన్ చేస్తోంది.

Share post:

Popular