నాపై వస్తున్న అసభ్యకర కామెంట్స్.. నన్ను ఏడిపిస్తున్నాయ్.. ఫీల్ అవుతున్న సమంత..!

నాగచైతన్య, సమంత కలిసి ఉన్నన్నన్ని రోజులు.. వారిద్దరూ క్యూట్ కపుల్ అంటూ అందరూ పొగడ్తలు కురిపించిన వారే. అయితే ఎప్పుడైతే నాగచైతన్య, సమంత తామిద్దరం విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించారో అప్పట్నుంచి సమంతకు సమస్యలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో నాగచైతన్యను ఒక్క మాట కూడా అనని నెటిజన్లు.. సమంతను మాత్రం ఏకిపారేస్తున్నారు.

నీ తీరు వల్లే వ్యవహారం విడాకుల వరకూ వెళ్ళింది.. అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక అక్కినేని ఫ్యాన్స్ అయితే అక్కినేని నాగేశ్వరరావు ఇంటికి కోడలిగా వెళ్లి ఇలా చేస్తావా..అని మండిపడ్డారు. గతంలో సిద్ధార్థ్ తో నడిపిన అఫైర్ ని బయటకు తీసుకువచ్చి.. అప్పుడు సిద్ధార్థను ఇప్పుడు నాగచైతన్యను వదిలేసావ్ అని కామెంట్స్ చేశారు.

సినిమాల్లో సమంత వస్త్రధారణపై అయితే ఇక చెప్పలేనంత రేంజిలో ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సమంత ఓ సెలబ్రిటీ తో జరిగిన చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ..తనపై వస్తున్న ట్రోల్స్ గురించి మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేసింది.

తన పట్ల సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయని.. అసభ్యకర కామెంట్స్ నన్ను ఎంతో బాధిస్తున్నాయని తెలిపింది. వచ్చే ఏడాది పై ఎలాంటి ఆశలు పెట్టుకోలేదని సమంత ఈ సందర్భంగా చెప్పింది. నాకోసం కాలం ఏది రాసిపెట్టినా.. దానిని ధైర్యంగా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొంది. ఏదిఏమైనా సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ సమంతపై చేస్తున్న ట్రోల్స్ ఆమెను ఇబ్బంది పెడుతున్నాయి.