ట్రైలర్ కోసం కొత్త డేట్ ఫిక్స్ చేసిన ఆర్ఆర్ఆర్..!

పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ ట్రైలర్ డిసెంబర్ 3వ తేదీన విడుదల కావాల్సి ఉండగా.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణంతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ట్రైలర్ విడుదల వాయిదా వేస్తున్నట్లు నిన్న ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ ప్రకటించింది. కాగా తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల విడుదల తేదీ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 7వ తేదీన కానీ 9వ తేదీన కానీ ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

ఆర్ఆర్ఆర్ సినిమాను రూ. 450 కోట్ల బడ్జెట్ తో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. ఈ మూవీ విడుదలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. బాహుబలి సిరీస్ లో వచ్చిన సినిమాలు దేశవ్యాప్తంగా రికార్డు స్థాయి కలెక్షన్లు వసూలు చేయడంతో రాజమౌళి తన తర్వాత సినిమా అయిన ఆర్ఆర్ఆర్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దానికితోడు ఇప్పటికే విడుదలైన టీజర్లు పాటలు కూడా బాగుండడంతో ఈ సినిమాకు హైప్ మరింత పెరిగింది.

ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా, అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 7వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానుంది.