`పుష్ప‌` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌..బ‌న్నీ మాస్ జాత‌ర మామూలుగా లేదుగా!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించ‌గా.. ఫహాద్‌ ఫాజిల్, సునీల్ విల‌న్ల‌గా క‌నిపిస్తారు. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతున్న సంగ‌తి తెలిసిందే.

అయితే ఫ‌స్ట్ పార్ట్ `పుష్ప ది రైజ్` నిన్న సౌత్ భాష‌ల‌తో పాటు హిందీలోనూ గ్రాండ్‌గా విడుద‌లైంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఫెర్ఫార్మెన్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలివ‌గా.. మిగిలిన వారు త‌మ త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. సుకుమార్ టేకింగ్‌, విజువ‌ల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇక టాక్ విష‌యం ప‌క్క‌న‌ పెడితే.. కలెక్షన్ల విషయంలో పుష్ప‌ దూసుకెళ్తోంది.

భారతదేంలోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా పుష్ప బాగానే కలెక్ట్ చేసి మాస్ జాత‌ర చూపించింది. మొద‌టి రోజు రూ. 38.49 కోట్ల షేర్ రాబ‌ట్టిన‌ ఈ చిత్రం.. రూ.63 కోట్ల గ్రాస్ వ‌సూల్ చేసింది. ఇక వ‌ర‌ల్డ్ వైడ్‌గా పుష్ప ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఈ విధంగా ఉన్నాయి..

నైజాం- 11.44 కోట్లు
సీడెడ్- 4.20కోట్లు
ఉత్తరాంధ్ర- 1.8కోట్లు
తూర్పు గోదావ‌రి- 1.43కోట్లు
పశ్చిమ గోదావ‌రి- 1.5కోట్లు
గుంటూరు- 2.28కోట్లు
కృష్ణ- 1.15 కోట్లు
నెల్లూరు- 1.10 కోట్లు
——————————————————————-
ఏపీ-తెలంగాణ‌ మొత్తం= 24.90 కోట్లు(35.5కోట్లు- గ్రాస్)
——————————————————————-

కర్ణాటక- 3.65 కోట్లు
తమిళనాడు- 1.82కోట్లు
కేరళ- 1.21కోట్లు
హిందీ- 1.66కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా- 1కోటి
ఓవర్సీస్‌ – 4.25కోట్లు
—————————————————————-
వ‌ర‌ల్డ్ వైడ్ టోట‌ల్ క‌లెక్ష‌న్‌- 38.49కోట్లు (63కోట్లు- గ్రాస్‌)
—————————————————————-

ఇక పుష్ప సినిమా ప్ర‌పంచవ్యాప్తంగా రూ.144.90 కోట్లు ప్రీ బెజినెస్ చేయ‌గా.. బ్రేక్ ఈవెన్ అవ్వాలం రూ.146 కోట్లను రాబ‌ట్టాలి. ఈ లెక్క‌న పుష్ప రాజ్ ఇంకా రూ. 107.51 కోట్లు గ్రాస్ వసూల్ చేయాల్సి ఉంది.

Share post:

Latest