`ఆదిపురుష్` టీమ్‌కు ప్ర‌భాస్ ఖ‌రీదైన గిఫ్ట్‌లు..ఏమిచ్చాడంటే?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `ఆదిపురుష్‌` ఒకటి. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం రామాయణం నేపథ్యంలో తెర‌కెక్కుతోంది. ఈ పాన్ ఇండియా చిత్రంలో రాముడిగా ప్ర‌భాస్‌, సీత‌గా బాలీవుడ్ బ్యూటీ కృతి స‌న‌న్‌, రావ‌ణుడిగా సైఫ్ అలీ ఖాన్, ల‌క్ష్మ‌ణుడిగా సన్నీ సింగ్ క‌నిపించ‌బోతున్నారు.

దాదాపు 300 కోట్ల బడ్జెట్ కేటాయించి టీ సిరీస్ బ్యానర్‌పై ఐదు భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా.. ప్ర‌స్తుతం గ్రాఫిక్స్ వర్క్స్ జ‌రుగుతున్నాయి. అయితే తాజాగా ప్ర‌భాస్ ఆదిపురుస్ టీమ్‌కి ఖ‌రీదైన గిఫ్ట్‌ల‌తో అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. లేటెస్ట్ స‌మాచారం ప్రకారం.. షూటింగ్ పార్ట్ పూర్తైన సంద‌ర్భంగా అదిపురుష్ మూవీ కోసం పని చేసిన టీమ్ మొత్తానికి అత్యంత ఖరీదైన ర్యాడో వాచ్ లు ప్ర‌భాస్ గిఫ్ట్‌గా పంపాడ‌ట‌.

టెక్నికల్ టీమ్ లోని ఒక సభ్యుడు ఈ విషయాన్ని తెలియజేస్తూ దానికి సంబంధించిన ఫోటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆయన మంచి మనసుకు ఫిదా అయిపోయారు నెటిజ‌న్లు. కాగా, ప్ర‌భాస్ మ‌రోవైపు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌లార్‌`, రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `రాధేశ్యామ్‌, నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో `ప్రాజెక్ట్-కె` చిత్రాలు చేస్తున్నాడు.

వీటిల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న రాధేశ్యామ్ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 14న సౌత్ భాష‌ల‌తో పాటు హిందీలో విడుద‌ల కాంబోతోంది. ఈ చిత్రంలో పొడుగు కాళ్ల సుంద‌రి పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించ‌గా.. కృష్ణం రాజు, జగపతిబాబు, భాగ్యశ్రీ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

Share post:

Popular