ప్రభాస్, పూజా లుక్ అవోసమ్.. సెకండ్ సింగిల్ సాంగ్ కు ట్రెమండస్ రెస్పాన్స్ ..!

ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు వచ్చింది. ఆయన హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ ఇవాళ విడుదలైంది. హిందీ భాషలో విడుదలైన ‘ఆషికి ఆగయీ’ అని సాగే పాటకు అభిమానుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఇటీవలి కాలంలో ఇంత గొప్ప మెలోడీ సాంగ్ రాలేదనే చెప్పాలి. ఎంతో గొప్పగా ఉంది ఈ పాట. సాంగ్ చిత్రీకరణ కూడా చాలా బాగుంది.

- Advertisement -

ప్రభాస్, పూజా హెగ్డే జంట తెరపై వీనుల విందుగా వుంది. వాళ్ళిద్దరిదీ పర్ఫెక్ట్ జోడి అనిపిస్తోంది. సాంగ్ మొత్తం కలర్ ఫుల్ గా ఉంది. ఈ సినిమాకోసం మేకర్స్ భారీగానే ఖర్చు పెట్టినట్లు ఉన్నారు. సెకండ్ సింగిల్ సాంగ్ మూడు నిమిషాల 12 సెకన్ల నిడివి ఉంది. ఈ పాట తెలుగు వర్షన్ ఇవాళ సాయంత్రం విడుదల కానుంది.

కాగా సాహో సినిమాలో తన లుక్ కోల్పోయాడని ప్రభాస్ పై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమాలో ప్రభాస్ తన లుక్ పూర్తిగా మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఈ సాంగ్ లో ప్రభాస్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. రాధే శ్యామ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన ఐదు భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాను యు. వి. క్రియేషన్స్ సంస్థ నిర్మించగా, రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు.

Share post:

Popular