భార‌త్‌లో ఒమిక్రాన్ క‌ల‌క‌లం..రాష్ట్రాల‌వారీగా కేసుల లెక్క‌లు ఇవే!

క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ భార‌త్‌లో రోజురోజుకు చాప కింద నీరులా విస్త‌రిస్తూ తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. మొట్ట మొద‌ట సౌతాఫ్రికాలో బ‌య‌ట ప‌డిన ఈ కొత్త వేరియంట్‌.. అన‌తి కాలంలో అనేక దేశాల‌కు పాకేసింది. ఇప్పటి వరకు ఈ వేరియంట్‌ వ్యాపించిన దేశాలు సంఖ్య వందకు చేరువలో ఉంది.

భార‌త్‌లోనూ ఒమిక్రాన్ కేసులు క్ర‌మ‌క్ర‌మంగా పెరిగి పోతున్నాయి. రాష్ట్రాల‌వారీగా కేసుల లెక్క‌లు ఇలా ఉన్నాయి.. మహారాష్ట్ర, ఢిల్లీ 54 కేసులతో అగ్రస్థానంలో ఉన్నాయి. 20 మరియు 19 కేసులతో తెలంగాణ మరియు కర్ణాటక వరుసగా మూడు మరియు నాలుగు స్థానాల్లో ఉండ‌గా..రాజస్థాన్ లో 18, కేరళలో 15, గుజరాత్ లో 14 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అలాగే ఉత్తరప్రదేశ్‌లో 2 కేసులు నమోదు అవ్వ‌గా.. ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ల్లో ఒక్కో కేసు చ‌ప్పున‌ నమోదైంది.

తాజాగా కేసుల‌తో భార‌త్‌లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 200 కు చేరింది. అయితే వీరిలో 77 మంది పూర్తిగా కోలుకుని హాస్ప‌ట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా, గతంలో బయటపడిన డెల్టా కంటే ఏడు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోన్న ఒమిక్రాన్ కు అడ్డు క‌ట్ట వేయాల‌ని ప్ర‌పంచ‌దేశాలు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆంక్ష‌ల‌ను క‌ఠిన‌త‌రంగా చేస్తున్నారు. ప‌లు దేశాల్లో మ‌ళ్లీ లాక్‌డౌన్ కూడా విధిస్తున్నారు.

Share post:

Latest