హీరోయిన్ ఐశ్వర్య రాయ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈమె విశ్వసుందరిగా పేరుపొందింది. ఇక ఈమె ఎన్నో విభిన్నమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను బాగా మెప్పించింది. అయితే ఈ మధ్యకాలంలో ఈమె హవా కాస్త తగ్గిందని చెప్పవచ్చు. అయితే తన కెరియర్ లో వదులుకున్న కొన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1). కుచ్ కుచ్ హోతా హై:
ఇందులో షారుక్ ఖాన్, సరసన ఐశ్వర్య రాయ్ నటించాల్సి ఉండగా.. కొన్ని కారణాలవల్ల రాణి ముఖర్జీ నటించింది.
2). వీర జార:
ముందుగా సామియ అనే పాత్రకు ఐశ్వర్యరాయ్ అని అనుకున్నారు.. కానీ ఆ తర్వాత రాణి ని హీరోయిన్ గా తీసుకున్నారు.
3). బాజీరావ్ మస్తానీ:
బాజీరావ్ మస్తానీ సినిమాలు కూడా మొదట మస్తానీ పాత్రను ఐశ్వర్యరాయ్ చేయాలని అనుకున్నారు. కానీ దీపికా పదుకొనే ఆ పాత్ర చేసి తన సినీ కెరీర్ ని అమాంతం మార్చేసుకుంది.
4). భూల్ బులయ్య:
ఈ సినిమాలో మంజులిక పాత్రకు ఐశ్వర్యరాయ్ ని ఎంచుకున్నారు. ఒక గ్రేట్ డాన్సర్ అని ఇందులో సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక ఆ తర్వాత విద్యాబాలన్ ను ఈ పాత్రకు ఎంచుకోగా ఒక ఆమె సినీ కెరియర్ అమాంతం పెరిగిపోయింది.
5). మున్నాభాయ్ ఎంబీబీఎస్:
చింకి అనే పాత్రకు ఐశ్వర్యరాయ్ ని అనుకోగా.. ఆ తర్వాత ఈ పాత్ర గ్రేసీ సింగ్ చేసి మెప్పించింది.
ఆ తర్వాత రాజా హిందుస్తానీ, చల్తే చల్తే , కార్పొరేట్, దోస్తానా వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలను ఐశ్వర్యారాయ్ వదులుకుంది