ప‌వ‌న్‌తో సిట్టింగ్ వేసిన క్రిష్‌..మ్యాట‌రేంటంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ క్రిష్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `హరి హర వీరమల్లు`. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్, బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

పీరియాడికల్ డ్రామాగా రూపొందనున్న ఈ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో 27వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక‌ ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న త‌రుణంలో క‌రోనా సెకెండ్ వేవ్ వ‌చ్చింది. అయితే క‌రోనా ఉధృతి త‌గ్గిన త‌ర్వాత ఈ చిత్రాన్ని ప‌క్క‌న పెట్టిన ప‌వ‌న్‌.. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో `భీమ్లా నాయ‌క్‌`ను సెట్స్ మీద‌కు తీసుకెళ్లాడు.

ఇక ప్ర‌స్తుతం భీమ్లా నాయక్ షూటింగ్ చివరి దశలో ఉండటంతో.. ప‌వ‌న్ తాజాగా క్రిష్‌తో సిట్టింగ్ వేసి హరి హర వీరమల్లు సినిమా గురించి చ‌ర్చ‌లు ప్రారంభించాడు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్‌కి స్క్రిప్ట్ చూపిస్తూ ఆయనతో చర్చిస్తున్న ఓ పిక్ డైరెక్టర్ క్రిష్ సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

అంతే కాదు, `పవన్‌తో హరిహర వీరమల్లు స్క్రిప్ట్ రీడింగ్ సెషన్. ఇది అద్భుతమైన రోజు. కొత్త సంవత్సరంలో ఉత్తేజకరమైన షెడ్యూల్‌ ప్రారంభించబోతున్నాం` అని పేర్కొన్నారు. దీంతో ఈ సినిమా వ‌చ్చే ఏడాది సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంద‌ని స్ప‌ష్టంగా అర్థమైంది.

Share post:

Latest