నానికి మ‌రో త‌ల‌నొప్పి.. అస‌లేం జ‌రిగిందంటే..?

న్యాచుర‌ల్ స్టార్ నాని బిగ్ స్క్రీన్‌పై క‌నిపించి చాలా కాల‌మే అయింది. ఈయ‌న గ‌త చిత్రాలైన `వి`, `ట‌క్ జ‌గ‌దీష్` రెండూ ఓటీటీలోనే విడుద‌ల అయ్యాయి. దీంతో నాని తదుప‌రి చిత్రం `శ్యామ్ సింగ‌రాయ్‌`పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. రాహుల్‌ సాంకృత్యన్ దర్శకత్వం వ‌హించిన ఈ మూవీలో సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు. కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ మూవీ డిసెంబ‌ర్ 24న తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.

అయితే అనుకోకుండా శ్యామ్ సింగ్‌రాయ్‌కి పోటీగా మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ న‌టించిన‌ ‘గని’ వచ్చి పడింది. బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కించిన ఈ మూవీపై సైతం భారీ అంచ‌నాలు ఉన్నాయి. దీంతో గ‌ని ఎఫెక్ట్ శ్యామ్ సింగ రాయ్ క‌లెక్ష‌న్స్‌పై ప‌డుతుంద‌ని ఇప్ప‌టికే స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ నానికి కొత్త‌గా మ‌రో త‌ల నొప్పి మొద‌లైంది. అదే `83`.

1983లో భారత జట్టు అండర్ డాగ్‌గా బరిలోకి దిగి సంచలన రీతిలో వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకున్న నేపథ్యంలో రూపుదిద్దుకున్న మూవీ ఇది. ఇందులో కపిల్ దేవ్‌గా రణ్‌వీర్ సింగ్ న‌టించ‌గా.. ఆయ‌న భార్య పాత్ర‌లో దీపికా పదుకునే క‌నిపించ‌బోతోంది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కూడా డిసెంబ‌ర్ 24న హిందీతో పాటుగా సౌత్ లో అన్ని భాషల్లో విడుదల కాబోతోంది. దీంతో ఈ సినిమా ప్ర‌భావం కూడా రాధేశ్యామ్‌పై భారీగా ప‌డ‌నుంది. అందుకే నాని మ‌రియు మూవీ టీమ్ కాస్త క‌ల‌వ‌ర ప‌డుతున్నార‌ని టాక్‌.

Share post:

Latest