నిండా ముంచేసిన‌ మెగా హీరోలు..లావణ్య త్రిపాఠి ల‌బోదిబో..?!

లావణ్య త్రిపాఠి.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అందాల రాక్షసి` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. మొద‌టి చిత్రంతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమా త‌ర్వాత వ‌రుస అవ‌కాశాల‌ను అందుకున్న లావ‌ణ్య త్రిపాఠి.. త‌న‌దైన అందం అభినయంతో టాలీవుడ్‌లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.

కానీ, ప్ర‌స్తుతం లావ‌ణ్య త్రిపాఠి కెరీర్ పూర్తిగా డ‌ల్ అయిపోయింది. లావణ్య ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న మెగా హీరోలు సైతం ఆమెకు నిండా ముంచేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఒకసారి మెగా కాంపౌండ్‌లోకి అడుగు పెడితే ఎవ‌రి ద‌శ అయినా తిరిగిన‌ట్టే అన్న టాక్ ఉంది. అందుకే దర్శకులైనా.. హీరోయిన్లు అయినా ఎప్పుడెప్పుడు మెగా కాంపౌండ్‌లోకి అడుగు పెడదామా అని వేచి చూస్తుంటారు.

అయితే లావ‌ణ్య త్రిపాఠికి మాత్రం మెగా హీరోలు క‌లిసిరాలేదు. ఈమె మొద‌టి సారి మెగా హీరో అల్లు శిరీష్ స‌ర‌స‌న `శ్రీరస్తు శుభమస్తు` సినిమాలో న‌టించింది. ఈ మూవీ ప‌ర్వాలేద‌నిపించుకున్నా.. లావ‌ణ్య‌కు మాత్రం పెద్ద‌గా ఒరిగిందేమిలేదు. ఆ త‌ర్వాత ఈమె మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న `మిస్ట‌ర్‌`, సాయి ధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న ఇంటెలిజెంట్ చిత్రాల్లో న‌టించింది.

ఈ రెండు సినిమాల‌తో త‌న ద‌శ మారుతుంద‌ని భావించిన లావ‌ణ్య‌కు నిరాశే ఎదురైంది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. దీంతో లావ‌ణ్య కెరీర్ పూర్తిగా డౌన్ అయిపోయింది. ఈ మ‌ధ్య `చావు కబురు చల్లగా` అనే సినిమాతో లావ‌ణ్య ప్రేక్షకుల‌ను ప‌ల‌క‌రించింది. కానీ, ఈ సినిమా ఫ్లాప్ టాక్‌ను సొందం చేసుకుంది. ఇక‌ ప్ర‌స్తుతం ఆఫ‌ర్ల లేక లావ‌ణ్య ల‌బోదిబోమంటుంద‌ని టాక్ న‌డుస్తోంది.

Share post:

Latest