క‌రోనా బారిన ప‌డ్డ మంచు మ‌నోజ్‌..వారికి హెచ్చ‌రిక‌..!

మాయ‌దారి వైర‌స్ క‌రోనా త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ళ్లీ విజృంభిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ముగిసింద‌ని ఊపిరి పీల్చుకునే లోపే ఒమిక్రాన్ రూపంలో మరో వేరియంట్ కోర‌ల చాస్తోంది. సామాన్యులే కాదు సినీ సెల‌బ్రెటీలు సైతం మ‌ళ్లీ వ‌ర‌స‌గా క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో, క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు త‌న‌యుడు మంచు మ‌నోజ్ క‌రోనా బారిన ప‌డ్డారు.

ఈ విష‌యాన్ని స్వ‌యంగా సోష‌ల్ మీడియా ద్వారా తెలిపిన మ‌నోజ్‌.. గ‌త కొద్ది రోజుల నుంచీ త‌న‌ను క‌లిసిన వారిని ముందు జాగ్ర‌త్త‌గా టెస్ట్‌లు చేయించుకోవాల‌ని హెచ్చ‌రించాడు. `నాకు క‌రోనా పాజిటివ్ అని తేలింది. ఇటీవ‌ల న‌న్ను క‌లిసిన ప్రతి ఒక్కరు వెంట‌నే క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరుతున్నా.

ప్రతి ఒక్కరూ కరోనా పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రస్తుతం నేను బాగానే ఉన్నా. డోంట్ వర్రీ.. మీ అందరి ప్రేమతో ఆరోగ్యంగా తిరిగివస్తా. వైద్యులు, న‌ర్సులంద‌రికీ నేను ప్రత్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాను` అని మంచు మ‌నోజ్ తాఆగా ట్వీట్ చేశాడు.

దీంతో ఆయ‌న అభిమానులు మ‌రియు ప‌లువురు నెటిజ‌న్లు మ‌నోజ్ త్వ‌ర‌గా కోలుకోవాలంటూ ఆకాక్షిస్తున్నారు. కాగా, మ‌నోజ్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఈయ‌న `అహం బ్రహ్మాస్మి` అనే సినిమా చేస్తున్నాడు. శ్రీకాంత్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.

Share post:

Popular