`ఆర్ఆర్ఆర్` కోసం తెర వెన‌క రామ్‌-భీమ్‌ల కష్టం..మేకింగ్ వీడియోలు వైర‌ల్‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తొలి సారి క‌లిసి న‌టించిన బిగ్గెస్ట్ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం)`. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య నిర్మించారు. బాలీవుడ్ భామ అలియా భ‌ట్‌, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో గోండు వీరుడు కొమరంభీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనువిందు చేయ‌నున్నారు.

ఇక ఇప్ప‌టికే షూటింగ్ మొత్తానికి పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. విడుద‌ల‌కు ఇంకా మూడు వారాలే ఉండ‌టంతో జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తున్న చిత్ర యూనిట్.. నిత్యం ఏదో ఒక అప్డేట్‌తో ప్రేక్ష‌కుల‌ను ఫుల్‌గా ఎంట‌ర్‌టైన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే మేక‌ర్స్ తాజాగా రామ్- భీమ్ మేకింగ్ వీడియోలను సోష‌ల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం రామ్‌గా చ‌ర‌ణ్‌, భీమ్‌గా ఎన్టీఆర్ తెర వెన‌క ఎంత క‌ష్ట‌ప‌డ్డారో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు ఈ వీడియోల్లో చూసించారు. ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారిన ఈ రెండు మేకింగ్ వీడియోల‌కు ప్రేక్ష‌కుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తుంది.

కాగా, స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా క‌ల్పిత క‌థ‌తో ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ మూవీగా ఆర్ఆర్ఆర్‌ను జ‌క్క‌న్న రూపొందించాడు. భారీ అంచ‌నాల ఉన్న ఈ చిత్రం కోసం సౌత్ ప్రేక్ష‌కులే కాదు నార్త్ ప్రేక్ష‌కులు సైతం ఎంతో ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు.

https://www.instagram.com/reel/CXsyQdYDLY0/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/reel/CXtPd_BBT8n/?utm_source=ig_web_copy_link

 

 

Share post:

Latest