మ‌హేష్‌తో బాల‌య్య `అన్ స్టాప‌బుల్‌`..ఇక ఫ్యాన్స్‌కి పూన‌కాలే!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ తొలి సారి హోస్ట్‌గా మారి చేస్తున్న షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే`. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఈ షో ప్ర‌సారం అవుతుండ‌గా.. మొద‌టి ఎపిసోడ్‌కి మోహ‌న్ బాబు ఫ్యామిలీ, రెండో ఎపిసోడ్‌కి నాని వ‌చ్చి బాల‌య్య‌తో సంద‌డి చేశారు. అలాగే మూడో ఎపిసోడ్‌కి కామెడీ కింగ్ బ్ర‌హ్మానందం, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి గెస్ట్‌లుగా విచ్చేశారు.

- Advertisement -

దీంతో ఇప్పుడు అన్ స్టాప‌బుల్ నాలుగో ఎపిసోడ్‌లో బాల‌య్య ఎవ‌ర్ని ఇంట‌ర్వ్యూ చేయ‌బోతున్నాడు..? అన్న‌ది హాట్ టాపిక్‌గా మారింది. అయితే వినిపిస్తున్న లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. ఈ సారి బాల‌య్య టాక్ షోలో సూప‌ర్ స్టార్ మ‌హేస్ బాబు గెస్ట్‌గా రాబోతున్నార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

కాగా, మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం కీర్తి సురేష్‌తో క‌లిసి `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్నాడు. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 1న విడుద‌ల కానుంది. దీంతో ఈ సినిమా షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతుండ‌గా.. మోకాలు నొప్పి ఇబ్బంది పెట్ట‌డం వ‌ల్ల మ‌హేష్ బాబు షూట్ నుంచి బ్రేక్ తీసుకున్నారు.

ఇక త్వ‌ర‌లోనే ఈయ‌న అమెరికా వెళుతున్నారు. అమెరికాలో మోకాలు సర్జరీ పూర్తయిన తరువాత రెండు నెలల పాటు ఆయన విశ్రాంతి తీసుకుని.. ఆపై స‌ర్కారు వారి పాట షూట్‌లో పాల్గొనున్నాడ‌ట‌. అయితే తాజాగా బాలకృష్ణ టాక్ షో నుంచి ఆహ్వానం అందడంతో అమెరికా వెళ్లడానికి ముందే ఈ షూటింగులో మహేష్ బాబు పాల్గొననున్నాట‌ని స‌మాచారం.

Share post:

Popular