తొలిసారి హాట్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చిన కీర్తి సురేష్‌..పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్‌!

కీర్తి సురేష్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌ల‌య‌ళంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ‌.. `నేను శైలజ` సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మొద‌టి సినిమాతోనే త‌నదైన అందం, అభిన‌యంతో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసిన కీర్తి.. మ‌హాన‌టి సినిమాలో సావిత్ర‌గా త‌న న‌ట‌నా విశ్వ‌రూపం చూపించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.

ఇక ఎక్స్‌పోజింగ్‌కు, హాట్ హాట్ ఫొటోల‌కు ఎప్పుడూ దూరంగా ఉండే కీర్తి.. తొలిసారి హాట్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చింది. సోష‌ల్ మీడియా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. తాజాగా ఓ పిక్‌ను షేర్ చేసింది. అందులో బెడ్‌పై కూర్చుకుని థైస్ అందాల‌ను చూపిస్తూ హాట్‌గా ఫొట‌ల‌కు పోజులిస్తూ కీర్తి క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారిన ఈ కీర్తి లేటెస్ట్ పిక్‌ను చూసి ఫ్యాన్స్ మ‌రియు నెటిజ‌న్స్ పిచ్చెక్కిపోతున్నారు.

కాగా, కీర్తి సురేష్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఈ భామ మ‌హేష్ బాబుకు జోడీగా ప‌రుశురామ్ తెర‌కెక్కిస్తున్న `స‌ర్కారు వారి పాట‌` చిత్రంలో న‌టిస్తోంది. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న `భోళా శంక‌ర్‌` సినిమాలో చిరంజీవికి చెల్లెల్లు కీర్తి క‌నిపించబోతోంది.

అలాగే ఈమె న‌టించి లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం గుడ్ ల‌క్ స‌ఖీ షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధంగా. ఇక వీటితో పాటుగా కీర్తి త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ ప‌లు చిత్రాలు చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది.

Share post:

Latest