ఘ‌నంగా కత్రినా కైఫ్-విక్కీ కౌశల్‌ల వెడ్డింగ్‌..నెట్టింట ఫొటోలు లీక్‌!

గ‌త కొద్ది రోజుల నుంచీ అటు ప్ర‌ధాన మీడియాలోనూ, ఇటు సోష‌ల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారిన కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌ల వెడ్డింగ్ నిన్న పూర్తైంది. మూడేళ్ల నుంచి ర‌హ‌స్యంగా ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్న ఈ బాలీవుడ్ బ్యూటీఫుల్‌ జంట ఎట్ట‌కేల‌కు మూడు ముళ్ల బంధంతో ఒక్క‌ట‌య్యారు.రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగ రంగ వైభ‌వంగా వీరి వివాహం జ‌రిగింది. అయితే ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ ఏకంగా వంద కోట్లకు కత్రినా- విక్కీల వివాహం యొక్క ప్రసార హక్కులను దక్కించుకుంది.

అతి త్వరలో ఈ వేడుకకు సంబంధించిన వీడియోలను ఒక్కోక్కటిగా అమెజాన్‌ ప్రైమ్ స్ట్రీమింగ్ చేయ‌నుంది. ఈ నేప‌థ్యంలోనే వీరి మ్యారేజ్‌కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అంతా సీక్రెట్‌గానే ఉంచలానుకున్నారు.

కానీ, తాజాగా కత్రినా కైఫ్-విక్కీ కౌశల్‌ల వెడ్డింగ్ ఫొటోలు నెట్టింట లీక్ అయ్యాయి. ప్రస్తుతం నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటున్న వీరి ఫొటోలు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నారు. మ‌రి లేటెందుకు లీకైన ఆ పిక్స్‌పై ఓ లుక్కేసేయండి.