సెకండ్ టెస్ట్: కివీస్ పై భారత్ భారీ విజయం..!

న్యూజిలాండ్ తో జరుగుతున్న సెకండ్ టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. 372 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (150) రాణించడంతో ఫస్ట్ ఇన్నింగ్స్ లో 325 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 62 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 276 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.

504 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ బ్యాటర్స్ ఎక్కడా విజయానికి ప్రయత్నించలేదు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో చేతులు ఎత్తివేసిన న్యూజిలాండ్ బ్యాటర్స్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కేవలం 167 పరుగులకే ఆలౌట్ అయ్యారు.సెకండ్ ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ ఆటగాళ్లలో మిచెల్ 60, నికొల్స్ 44 పరుగులు చేశారు.

భారత జట్టు తరఫున అశ్విన్, జయంత్ యాదవ్ చెరో నాలుగు వికెట్లు తీశారు. అక్షర్ పటేల్ కు ఒక వికెట్ దక్కింది. కాగా ఈ మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో 150, సెకండ్ ఇన్నింగ్స్ లో 62 పరుగులు చేసిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. అలాగే సిరీస్ ఆసాంతం ఆకట్టుకున్న స్పిన్నర్ అశ్విన్ కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ దక్కింది. టెస్టుల్లో అశ్విన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కించుకోవడం ఇది పదవ సారి కావడం గమనార్హం.

Share post:

Latest