`ఎఫ్ 3` విడుద‌ల వాయిదా.. కొత్త తేదీ ఇదే..!

విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఎఫ్ 3`. 2019 సంక్రాంతి బరిలో దిగి భారీ విజయం సాధించింది ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఎఫ్ 2లో భార్యాభర్తల మధ్య వచ్చే ఫ్రస్ట్రేషన్‌ ని చూపించిన‌ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఎఫ్ 3లో డ‌బ్బు చుట్టూ తిరిగే ఫ్రస్ట్రేషన్ ని చూపించ‌బోతున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని మొద‌ట వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వరి 25న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. కానీ, ఎఫ్ 3 ఇప్పుడా తేదీకి రావ‌డం లేదు. ప‌లు కార‌ణాల వ‌ల్ల వాయిదా వేశారు.

అంతే కాదు, తాజాగా ఎఫ్ 3 కొత్త‌ రిలీజ్ డేట్‌ను సైతం మేక‌ర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. దాని ప్ర‌కారం.. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుద‌ల కానుంది. సమ్మర్ సోగాళ్లు సంద‌డికి సిద్ధం అవ్వండి అంటూ ఎఫ్ 3 మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేసింది చిత్రయూనిట్.

దీంతో ఇప్పుడీ పోస్ట‌ర్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. కాగా, ప్ర‌ముఖ న‌టుడు సునీల్ కీల‌క పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో రేచీకటి ఉన్న వ్య‌క్తిగా వెంకటేష్‌, న‌త్తి ఉన్న వ్యక్తిగా వ‌రుణ్ తేజ్‌లు క‌నిపించ‌బోతున్నారు. ఎఫ్ 2 మూవీకి మించి డబల్ కామెడీ, డబల్ ఎంటర్టైన్మెంట్ ఎఫ్ 3లో ఉండ‌బోతోంది.

Share post:

Popular