కండోమ్స్ ఫర్ బోత్ : వీటిని ఆడ, మగ ఎవరైనా వాడొచ్చు..!

పూర్వకాలంలో కండోమ్స్ వాడకం అనేది ఉండేది కాదు. అందుకే దంపతులు ఐదు నుంచి పది మంది పిల్లలను కనేవారు. ఆ తర్వాత 1855లో మొదటిసారిగా ప్రపంచంలో కండోమ్స్ వాడకం మొదలైంది. అయితే మొదట్లో గర్భ నిరోధం కోసమే ఈ కండోమ్స్ వాడేవారు. రబ్బర్ తో తయారు చేసే కండోమ్స్ అప్పట్లో అందుబాటులో ఉండేవి. అయితే అవి గర్భ నిరోధంలో పూర్తిస్థాయి రక్షణ ఇచ్చేవి కాదు. ఆ తర్వాత లేటెక్స్ టైప్ కండోమ్స్ 1920 నుంచి వాడకంలోకి వచ్చాయి. 2008లో పాలిసోప్రేన్ రకం కండోమ్స్ వచ్చాయి. ఇప్పుడు ఎక్కువగా వాడకంలో ఉన్నవి ఈ రెండు రకాలే.

- Advertisement -

 

అయితే మొదట్లో గర్భనిరోధానికి మాత్రమే కండోమ్స్ వాడేవారు. ఆ తర్వాత ఎయిడ్స్ వంటి సుఖ వ్యాధులు వ్యాప్తి అధికమైన తర్వాత కలయికలో కండోమ్స్ వాడకం తప్పనిసరిగా మారింది. ముందు పురుషులకు మాత్రమే కండోమ్స్ ఉండగా..ఆ తర్వాత స్త్రీలు కూడా ధరించే కూడా కండోమ్స్ అందుబాటులోకి వచ్చాయి.

ఇప్పుడు తాజాగా ఆడ మగ ఎవరైనా వాడే రకపు కండోమ్స్ వచ్చాయి. ఈ రకం కండోమ్స్ స్త్రీలు అయినా పురుషులు అయినా వాడొచ్చు. మలేషియాకు చెందిన జాన్ టాంగ్ అనే గైనకాలజిస్ట్ పురుషులకు ఒక రకం, స్త్రీలకు ఒక రకం కండోమ్స్ అంటూ లేకుండా.. ఆడ మగ అన్న తేడా లేకుండా ఎవరైనా వాడే వీలుగా ఉండే కండోమ్స్ ను రూపొందించారు.

ఈ కండోమ్స్ వాడకంతో సుఖవ్యాధులు దూరం

మామూలుగా కండోమ్స్ వాడినప్పటికీ అవి వందశాతం రక్షణ ఇవ్వలేవు. ఒక్కొక్కసారి కలయికలో కండోమ్స్ చిరిగి పోయే అవకాశం ఉంటుంది. వందకు వందశాతం ఏ కండోమ్స్ కూడా రక్షణ ఇవ్వలేవు. కానీ జాన్ టాంగ్ రూపొందించిన కండోమ్స్ ఇతర కండోమ్స్ తో పోలిస్తే సుఖవ్యాధుల నుంచి ఎక్కువగా రక్షణ కలిగిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అలాగే కొందరికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న లేటెక్స్ కండోమ్స్ వాడితే అలర్జీ వస్తుంటుంది. అందువల్ల వారు కండోమ్స్ వాడలేకపోతున్నారు. మలేషియాలో కొత్తగా రూపొందించిన కండోమ్స్ పాలీయురేథేన్ తో తయారు చేయడం వల్ల ఎలాంటి ఎలర్జీ సమస్యలు తలెత్తవు. ప్రస్తుతం ఈ రకం కండోమ్స్ మలేషియా లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అతి త్వరలోనే మిగిలిన దేశాల్లో కూడా ఈ కండోమ్స్ అందుబాటులోకి రానున్నాయి.

Share post:

Popular