కేసీఆర్ వైపు చూపిస్తున్న కిషన్ వేలు

నేను ఆయనను కలవాలని చాలా సార్లు ప్రయత్నించా.. అయినా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు.. నేను కేంద్ర మంత్రి కావడం ఆయనకు ఇష్టం లేదేమో.. అందుకే కలవడానికి అవకాశం ఇవ్వలేదేమో.. అని కేంద్ర కేబినెట్ మంత్రి, టీ.బీజేపీ సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ నుద్దేశించి పేర్కొన్నారు. వరి కొనుగోలు వ్యవహారం తెలంగాణలో రైతులకేమో గానీ పార్టీల మధ్య వేడిపుట్టింది. ఓ వైపు రైతులు ప్రాణాలు కోల్పోతుంటే.. కారు, కమలం పార్టీలు మాత్రం రాజకీయ గొడవలకు దిగుతున్నారు. ఇపుడు మరో అడుగు ముందుకేసిన కిషన్ రెడ్డి.. కేసీఆర్ ను నేరుగా టార్గెట్ చేశారు. కేబినెట్ మినిస్టర్ అయిన తన సేవలను తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగించుకోవడం లేదని వాపోయారు. కనీసం ఫోన్ చేసినా కూడా స్పందించడ లేదని, అధికారులైతే అస్సలు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఇదంతా ఆయన ఎందుకు చెబుతున్నాడంటే..

వరి వ్యవహారంలో తన తప్పేమీ లేదని పరోక్షంగా చెబున్నారు. అంతేకాక.. కిషన్ రెడ్డి కేసీఆర్ ఆఫర్ కు ఒప్పుకున్నరు. వరి కొనుగోలు వ్యవహారంపై బహిరంగ చర్చకు సిద్ధమేనని ప్రకటించారు. మీడియా ఎదుట.. పద్దతిగా మాట్లాడితే నేను చర్చకు రెడీగా ఉన్నా అని చెబుతున్నారు. కేంద్ర మంత్రిగా.. రాష్ట్రానికి చెందిన నాయకుడిగా తాను ఢిల్లీలో రైతులకు మద్దతుగా ప్రభుత్వంతో చర్చలు జరిపానని, మంత్రి పీయూష్ గోయల్ తో కూడా మాట్లాడానని చెప్పారు. ఆయనతో మాట్లాడిన తరువాతే ధన్యాన్ని కొనుగోలు చేస్తామని మీడియాతో వెల్లడించానని అన్నారు. టీఆర్ఎస్ నాయకులేమో ..కేంద్రం కొనుగోలు చేయలేం అని చెప్పారు‘ అని పేర్కొన్నారని అంటున్నారు.. టీ.బీజేపీ మాత్రం కేంద్రం కొంటుంది అని చెబుతోంది. కొంటాం అని చెబుతోంది. మరి ఎవరు కరెక్టుగా చెబుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. చివరకు రైతుల సమస్య పరిష్కారమవుతుందో.. లేక రాజకీయ యుద్దం కొనసాగుతోందో వారికే తెలియాలి.