బిగ్‌బాస్ 5: ఈ వారం బ్యాగ్ స‌ద్దేసేది ఆ కంటెస్టెంటేన‌ట‌..?!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 చివ‌రి ద‌శ‌కు చేరువ‌వుతోంది. మొత్తం 19 మందితో అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన ఈ షోలో ప్ర‌స్తుతం ఆరుగురే మిగిలి ఉన్నారు. స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేతా వ‌ర్మ‌, లోబో, ప్రియ‌, విశ్వ‌, జెస్సీ, యానీ మాస్ట‌ర్‌, యాంక‌ర్ ర‌వి, ప్రియాంక‌లు వ‌ర‌సగా ఎలిమినేట్ అవ్వ‌గా.. స‌న్నీ, శ్రీ‌రామ్‌, మాన‌స్‌, కాజ‌ల్‌, సిరి మ‌రియు ష‌ణ్ముఖ్‌లు హౌస్‌లో కొన‌సాగుతున్నారు.

ప్ర‌స్తుతం ఈ ఆరుగురు బిగ్ బాస్ టైటిల్‌ను గెలుచుకునేందుకు తీవ్రంగా పోటీ ప‌డుతున్నారు. ఇక ఈ వారం నామినేష‌న్స్ విష‌యానికి వ‌స్తే.. టికెట్ టు ఫినాలే సాధించిన శ్రీరామ్ మిన‌హా మిగిలిన ఐదుగురు ఇంటి సభ్యులు డైరెక్ట్‌గా 14వ వారంలో ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు. అయితే వీరిలో ఈ వారం ఎవ‌రు బ్యాగ్ స‌ద్దేస్తార‌న్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

మాన‌స్‌, స‌న్నీ, ష‌ణ్ముఖ్‌.. ఈ ముగ్గురూ భారీ ఓటింగ్‌తో దూసుకుపోతున్నారు. ఇక మిగిలింది కాజ‌ల్‌, సిరిలే. అయితే ఈ ఇద్ద‌రిలో సిరినే 14వ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు ఎక్కువ‌గా ఉన్నార‌ని సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మ‌వుతుందో తెలియాలంటే ఆదివారం వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

కాగా, బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ డిసెంబర్ 19న అంగ రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌బోతోంది. బిగ్ బాస్ సీజ‌న్ 5 విజేత‌కు ట్రోఫీ, 50 ల‌క్ష‌లు ప్రైజ్ మ‌నీతో పాటుగా సొంత ఇంటిని కట్టుకునేందుకు షాద్‌నగర్‌లో సువర్ణ కుటీర్‌లో రూ.25 లక్షల విలువైన 300 చదరపు గజాల స్థలాన్ని సైతం ఇవ్వ‌బోతున్నారు.

Share post:

Latest