అక్కినేని హీరోల‌తో చిట్టి పార్టీ సాంగ్‌.. పోస్ట‌ర్ అదిరిందిగా!

టాలీవుడ్ మ‌న్మ‌ధుడు, సీనియ‌ర్ స్టార్ హీరో నాగార్జున ప్ర‌స్తుతం త‌న‌యుడు నాగ చైత‌న్యతో క‌లిసి `బంగార్రాజు` చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. 2016లో విడుదలై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన `సోగ్గాడే చిన్నినాయన` చిత్రానికి ప్రీక్వెల్‌‌‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్‌ బ్యానర్ల‌ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ‌, కృతి శెట్టి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమాలో ఓ అదిరిపోయే ఐటెం ఉంది. అయితే ఈ ఐటెం సాంగ్‌లో `జాతిర‌త్నాలు` సినిమాతో చిట్టిగా సూప‌ర్ పాపుల‌ర్ అయిన హైద‌రాబాదీ పిల్ల ఫరియా అబ్దుల్లా అక్కినేని హీరోల‌తో చిందులు వేయ‌బోతోంది.

ఇప్ప‌టికే ఈ సాంగ్ చిత్రీక‌ర‌ణ పూర్తి అవ్వ‌గా.. డిసెంబ‌ర్ 17న ఈ పాట‌కు సంబంధించిన టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ అధికారికంగా తెలియ‌జేస్తూ ఓ అదిరిపోయే పోస్ట‌ర్‌ను వీడియో రూపంలో పోస్ట్ చేశారు. అంతే కాదు, `పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయ‌ర్` అంటూ క్యాప్ష‌న్ ను కూడా జోడించారు.

కాగా, ఈ సినిమాకు అనూప్‌ రూబెన్స్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటల‌కు సూప‌ర్ రెస్పాన్స్ రాగా.. త్వ‌ర‌లో విడుద‌ల కాబోయే మూడో పాట‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

Share post:

Popular