`అఖండ` సెన్సేష‌న‌ల్ రికార్డ్‌.. యుఎస్ లో బాల‌య్య ప్ర‌భంజ‌నం!

న‌ట‌సింహం నంమూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన `అఖండ‌` చిత్రంలో నిన్న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్ పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించ‌గా.. శ్రీ‌కాంత్ విల‌న్ పాత్ర‌ను పోషించాడు.

భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌ల ఈ మూవీ సూప‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. గ్రామ పెద్ద మురళీ కృష్ణగా, అఖండగా రెండు విభిన్న పాత్రలో కనిపించిన బాలయ్య.. రెండు పాత్రల్లోనూ వేరియేషన్‌ చూపించి అద‌ర‌గొట్టేశాడు. ఇక మాస్ ప్రేక్ష‌కుల‌కు పిచ్చ పిచ్చ‌గా న‌చ్చిన ఈ చిత్రం కేవలం ఇండియాలోనే కాకుండా యుఎస్ లోనూ బాక్సాఫీస్ వ‌ద్ద‌ ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది.

ఈ నేప‌థ్యంలోనే ప్రీమియర్ షోల ద్వారా అమెరికాలో అఖండ చిత్రం ఏకంగా 325K డాలర్లు వసూలు చేసింది. దీంతో ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో అత్య‌ధిక డాల‌ర్లు సాధించిన ఏకైక చిత్రంగా అఖండ సెస్సేష‌న‌ల్ రికార్డును ఖాతాలో వేసుకుంది. ఇక ఈ సినిమా త‌ర్వాత 313K డాలర్లతో నాగ చైత‌న్య న‌టించిన‌ లవ్ స్టోరీ, 300K డాలర్లతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన వ‌కీల్ సాబ్ చిత్రాలు ఉన్నాయి.

కాగా, అఖండ చిత్రానికి రూ.53.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.54 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. అయితే మొద‌టి రోజే తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 15.39కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తంది. ఇక లాంగ్ వీకెండ్ ఉంది కాబట్టి అఖండ చిత్రానికి మంచి అడ్వాంటేజ్ ఉంది.