బాలయ్య కెరీర్ లో మరో ల్యాండ్ మార్క్ అఖండ..!

40 ఏళ్లకు పైగా సినీ ప్రస్థానంలో నందమూరి బాలకృష్ణకు ఎన్నో ల్యాండ్ మార్క్ మూవీలు ఉన్నాయి. 80స్, 90 స్ లో బాలకృష్ణ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. బాలకృష్ణ కెరీర్ లో సమరసింహారెడ్డి నరసింహనాయుడు ప్రత్యేకం. అవి రెండూ ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి. బాలకృష్ణ రేంజిని ఓ స్థాయికి తీసుకెళ్లాయి. ఆ రెండు సినిమాల తర్వాత మరో బ్లాక్ బస్టర్ మూవీ కొట్టేందుకు బాలకృష్ణ కు చాలా సమయమే పట్టింది.

బోయపాటి శ్రీను- బాలకృష్ణ కాంబినేషన్ లో తొలిసారిగా వచ్చిన సింహా సినిమా వరకు మళ్లీ బాలకృష్ణ కు సరైన హిట్ దక్కలేదు. మధ్యలో లక్ష్మీ నరసింహా సినిమా వచ్చినప్పటికీ అది బాలకృష్ణ స్థాయి విజయం కాదు. సింహా తర్వాత మళ్లీ లెజెండ్, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలు బాలకృష్ణ కెరీర్ లో మంచి హిట్ సినిమాలుగా నిలిచాయి.

అయితే గౌతమీపుత్ర శాతకర్ణి తరువాత బాలకృష్ణకు వరుసగా ఐదు ఫ్లాప్ లు వచ్చాయి. పైసా వసూల్, జై సింహా, రూలర్, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలతో వరుసగా ఫ్లాపులు వచ్చాయి. జైసింహా సినిమా ఉన్నంతలో పర్వాలేదనిపించే స్థాయిలో వసూళ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో బోయపాటి- బాలకృష్ణ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వచ్చిన అఖండ బాలకృష్ణ కెరీర్ లో మరో ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచింది.

ఈ సినిమాతో బాలకృష్ణ కెరీర్ లోనే మొదటిసారిగా వంద కోట్ల క్లబ్ లో చేరాడు. పది రోజులకు ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించగా.. థియేటర్లలో ఇప్పటికీ మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఈ సినిమా ఫైనల్ రన్ లో ఏ రేంజ్ లో వసూళ్లు సాధిస్తుందో.. ఇంకా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Share post:

Popular