`అఖండ‌` డే2 క‌లెక్ష‌న్స్‌.. నైజాంలో బాల‌య్య ప్ర‌భంజ‌నం..!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ ముచ్చ‌ట‌గా మూడో సారి తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. జ‌గ‌ప‌తిబాబు, శ్రీ‌కాంత్‌, పూర్ణ‌ కీల‌క పాత్ర‌లు పోషించారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉన్నా క‌రోనా కార‌ణంగా ఆల‌స్యం అయింది.

ఇక ఎట్ట‌కేల‌కు భారీ అంచ‌నాల న‌డుమ‌ డిసెంబ‌ర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన ఈ చిత్రం.. సూప‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్ల‌ను రాబడుతోంది. తొలి రోజు ఏపీ, తెలంగాణలో రు. 15.39 కోట్ల షేర్ వ‌సూళ్ చేసి అఖండ‌.. రెండో రోజు రూ.6.83 కోట్ల‌ను క‌లెక్ట్ చేసింది.

ముఖ్యంగా నైజాంలో బాల‌య్య ప్ర‌భంజ‌నం సృష్టించాడు. నైజాంలో రూ. 10.5 కోట్లు బిజినెస్ చేసిన అఖండ.. ఫ‌స్ట్ డే రూ. 4.39 కోట్లను రాబ‌ట్ట‌గా సెకెండ్ డే రూ. 2.26 కోట్లు వ‌సూల్ చేసింది. ఇక ఏరియాల వారీగా అఖండ రెండో రోజు వ‌సూళ్లు ఇలా ఉన్నాయి..

నైజాం – 2.26 కోట్లు
సీడెడ్ – 1.98 కోట్లు
ఉత్త‌రాంధ్ర – 46 ల‌క్ష‌లు
వెస్ట్ – 34 ల‌క్ష‌లు
గుంటూరు – 41 ల‌క్ష‌లు
కృష్ణా – 44 ల‌క్ష‌లు
నెల్లూరు – 25 ల‌క్ష‌లు
——————————————————————
ఏపీ + తెలంగాణ = 6.83 కోట్ల షేర్‌(గ్రాస్‌: 10.4 కోట్లు)
—————————————————————–

కాగా, అఖండ ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.53 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దీంతో ఇప్పుడీ చిత్రం రూ. 54 కోట్లు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్‌లోకి వెళ్తుంది. ఒక ఎలాగో హిట్ టాక్‌తో పాటు మరో సినిమా పోటీలో లేదు. కాబ‌ట్టి. బాల‌య్య వీకెండ్ వ‌చ్చే స‌రికి టార్గెట్ రీచ్ అవ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

Share post:

Popular